BigTV English

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Motorola Edge 50 Neo Launch Today: ప్రముఖ టెక్ బ్రాండ్ మోటో తన తదుపరి లైనప్‌లో ఉన్న మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇవాళ అంటే సెప్టెంబర్ 16న Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. కాగా ఈ ఫోన్ భారతదేశంలో లాంచ్‌కు ముందు ఇప్పటికే యూరోపియన్ మార్కెట్‌లలో రిలీజ్ అయింది. ఇప్పుడు దాని స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. Motorola Edge 50, Edge 50 Pro, Edge 50 Fusion, Edge 50 Ultra లైనప్‌ తర్వాతి మోడల్‌గా Motorola Edge 50 Neo ఐదవ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలోకి ప్రవేశించడానికి సిద్ధమైంది.


అయితే ఇది ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌ల పరంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు ఈ మోటరోలా ఎడ్జ్ 50 నియో లాంచ్, అంచనా ధర విషయానికొస్తే.. Motorola Edge 50 Neo ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత Flipkart, Motorola.in, ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో Motorola Edge 50 Neo అంచనా ధర విషయానికొస్తే.. ఇది రూ.30,000 నుంచి రూ. 40,000 మధ్య ధరలో ఉంటుందని అంచనా వేయబడింది. కాగా UKలో ఎడ్జ్ 50 నియో ధర £399 (దాదాపు రూ. 44,100)గా నిర్ణయించబడింది. Edge 50 Neo ఇప్పటికే UK, యూరప్‌లో లాంచ్ అయిన దాని ప్రకారం.. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం.


Also Read: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Motorola Edge 50 Neo Specifications

Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.36 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వచ్చింది. అలాగే MediaTek Dimensity 7300 SoC ప్రాసెసర్ ద్వారా 12GB LPDDR4X RAM + 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌ను కలిగి ఉంది. అలాగే ఎడ్జ్ 50 నియో 68W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4310 mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. ఇక దీని కెమెరా విషయానికొస్తే.. Motorola Edge 50 Neo OISకి మద్దతు ఇచ్చే 50MP Sony IMX896 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరా 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది.

అలాగే 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో యూనిట్ అందించబడింది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. Motorola Edge 50 Neo వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. మొబైల్ సేఫ్టీ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ స్క్రీన్ కింద ఉంటుంది. Motorola Edge 50 Neo ఫోన్ Android 14-ఆధారిత Hello UIపై రన్ అవుతుంది. Motorola Edge 50 Neoకి ఐదేళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×