BigTV English

Bigg Boss 8 Telugu Promo: డ్రామాలు చేస్తావు, నీకు దమ్ము లేదా?.. మణకంఠను పర్సనల్‌గా టార్గెట్ చేసిన యష్మీ

Bigg Boss 8 Telugu Promo: డ్రామాలు చేస్తావు, నీకు దమ్ము లేదా?.. మణకంఠను పర్సనల్‌గా టార్గెట్ చేసిన యష్మీ

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటివరకు బేబక్క, శేఖర్ భాషా.. ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయి హౌజ్ నుండి బయటికి వచ్చేశారు. కానీ శేఖర్ భాషా ఎలిమినేట్ అవ్వగానే ఇది చాలా అన్యాయం అని, హౌజ్ నుండి బయటికి రావాల్సింది తను కాదు అంటూ నెటిజన్లు కలిసికట్టుగా తనకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మళ్లీ శేఖర్ భాషా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ మొదలయ్యాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా బయటికొచ్చింది. గతవారం యష్మీ అండ్ టీమ్ చేసిన ఓవరాక్షన్‌కు చాలామంది వారినే నామినేట్ చేయాలని ఫిక్స్ అయినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.


డామినేట్ చేయలేదు

తాము నామినేట్ చేయాలనుకునే ఇద్దరు కంటెస్టెంట్స్ తలపై చెత్త వేసి వారిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ముందుగా సీత వచ్చి యష్మీ, పృథ్విని నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. ‘‘ఏ టాస్క్ జరిగిన డామినేట్ చేయాలని చూస్తున్నావు’’ అంటూ యష్మీని నామినేట్ చేయడానికి కారణం చెప్పింది సీత. కానీ సీత చెప్పినదానికి యష్మీ ఒప్పుకోలేదు. ఎవరూ అలా ప్రవర్తించలేదు అంటూ తనను తాను సమర్ధించుకోవాలని చూసింది. పృథ్వి కూడా అదే చేశాడు. ‘‘నేను ఒక టీమ్‌లో ఆడుతున్నప్పుడు అవతలి టీమ్‌ను ఓడించాలనే ఆడతాను. అదే ఇక్కడ గేమ్’’ అంటూ తన గేమ్ గురించి మాట్లాడాడు పృథ్వి.


Also Read: అతడు తల్లి చావుతో లాభం పొందాలనుకున్నాడు.. శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్

మణికంఠ ఫైర్

‘‘ఒక మనిషి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పక్కన కూర్చొని చప్పట్లు కొడితే అది రైట్ అనుకుంటారు లేకపోతే తప్పు అనుకుంటారు’’ అంటూ తన స్టైల్‌లో వివరించాలని చూసింది సీత. మధ్యలో పృథ్వి జోక్యం చేసుకున్నా వినకుండా అది కామన్ సెన్స్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘‘ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగడం లేదు, ఎవరు చపాతీలు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు..’’ అంటూ యష్మీని నామినేట్ చేసి మణికంఠ తన కారణం చెప్పబోతున్నాడు. కానీ మధ్యలోనే యష్మీ అడ్డుకుంది. అది నచ్చని మణికంఠ.. ‘‘నేను మాట్లాడుతున్నప్పుడు ముందు విను’’ అంటూ అరిచాడు. ‘‘ప్రతీ పనిలో అనవసరంగా జోక్యం చేసుకుంటావు’’ అంటూ యష్మీ గురించి చెప్పుకొచ్చాడు.

ఫ్రెండ్ అనుకున్నాను

‘‘నువ్వు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్‌గా డ్రామాలు చేస్తావు చూడు’’ అంటూ మణికంఠను పర్సనల్‌గా టార్గెట్ చేయాలనుకుంది యష్మీ. దానికి మణికంఠ ఒప్పుకోలేదు. ‘‘సమస్యే లేదు. నాకు ఒక మనిషిలో ఒక లక్షణం నచ్చకపోతే ఇలాగే మాట్లాడతా’’ అని తను చెప్తున్నా వినకుండా తనను ఫేక్ అనేసింది యష్మీ. ‘‘నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను’’ అంటూ రివర్స్ అయ్యాడు. ‘‘నా మాటలను తొక్కేయడానికి ప్రయత్నించావు నాకు అది నచ్చలేదు’’ అని తన పాయింట్ చెప్తుండగానే.. ‘‘నువ్వు గట్టిగా చెప్పాలి కదా. నీకు ఆ దమ్ము లేదా’’ అని సీరియస్ అయ్యింది యష్మీ. ‘‘నీకు కోపం లేదు. అందుకే నా కోపం నీకు తప్పు అనిపిస్తుంది’’ అంటూ పృథ్వి కూడా మణికంఠపై రివర్స్ అయ్యాడు. ‘‘కోపం వేరు, ఆడే విధానం వేరు’’ అని వివరించాడు మణికంఠ.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×