BigTV English
Advertisement

Motorola Edge 50 Neo: అబ్బబ్బ ఏం ఫోన్‌ రా మావా.. ఫస్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు, ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

Motorola Edge 50 Neo: అబ్బబ్బ ఏం ఫోన్‌ రా మావా.. ఫస్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు, ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

Motorola Edge 50 Neo Flipkart Big Billion Days sale 2024: మోటో కంపెనీ దేశీయ మార్కెట్‌లో పలు ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు అందుకుంది. అదే సమయంలో తన లైనప్‌లో రిలీజ్ అయిన మొబైళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించి మరింత దూసుకుపోతుంది. ఇటీవలే Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లాంచ్ అనంతరం ఈ ఫోన్ డిజైన్, లుక్, స్పెసిఫికేషన్లు ఫోన్ ప్రియులను బాగా అట్రాక్ట్ చేశాయి. దీంతో దీనిని కొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ సేల్ తాజాగా ప్రారంభం అయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఆఫర్లు, ఇతర వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.


ఈ ఫోన్ 6.4 అంగుళాల pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. అలాగే గరిష్టంగా 3000 nits బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB LPDDR4X RAM + 256GB UFS 2.2 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది. అంతేకాకుండా 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4310mAh బ్యాటరీని కలిగి ఉంది. మరెన్నో ఉన్నాయి.

Motorola Edge 50 Neo Specifications


Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.4-అంగుళాల pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2.5GHz ఆక్టా కోర్ MediaTek డైమెన్సిటీ 7300 4nm ప్రాసెసర్ అందించబడింది. అంతేకాకుండా ఇందులో 8GB LPDDR4X RAM + 256GB UFS 2.2 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4310mAh బ్యాటరీ ఉంది. ఇది సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Also Read: వాసివాడి తస్సాదియ్య.. రూ.9,499 లకే సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, డోంట్ మిస్ బ్రదరూ!

కాగా ఈ ఫోన్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో వచ్చింది. నాటికల్ బ్లూ, లాట్, గ్రిసైల్, పోయిన్సియానా వంటి కలర్‌లలో వచ్చింది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. Motorola Edge 50 Neo లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది. ఇక వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఫోన్‌ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అందువల్ల అధునాతన ఫీచర్లతో కొత్త ఫోన్‌ని కొనుక్కోవాలని అనుకుంటే ఇదే సరైన సమయం.

Motorola Edge 50 Neo Sale Offers

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఫెస్టివల్ ఆఫర్ కింద కంపెనీ దీనిపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ.1000 తక్షణ తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 6 నెలల నో-కాస్ట్ ఇఎంఐపై కూడా అందుబాటులో ఉంది. త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో ఈ ఫోన్‌ను తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే 5% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

Related News

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Big Stories

×