BigTV English

UP Food Operators’ Details: ‘నేమ్ బోర్డులో హోటల్ యజమాని వివరాలు తప్పనిసరి’.. ఆదేశాలు జారీ చేసిన యూపీ సిఎం!

UP Food Operators’ Details: ‘నేమ్ బోర్డులో హోటల్ యజమాని వివరాలు తప్పనిసరి’.. ఆదేశాలు జారీ చేసిన యూపీ సిఎం!

UP Food Operators’ Details| ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల ఆహార విక్రయాలు చేసే స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో జరిగిన కొన్ని అసహ్యకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వంట చేసే వారు అందులో ఎంగిలి, మూత్రం కలుపుతున్నారని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ ఘటనలు తరుచూ జరుగుతుండడంతో వీటిని నివారించడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగిచ్చింది.


సెప్టెంబర్ 12న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక హోటల్ లో వంట చేసేవ్యక్తి చపాతీలపై తన ఎంగిలి పూయడం కనిపించింది. ఆ వీడియో ఉత్తర్ ప్రదేశ్ లోని సహారన్ పూర్ జిల్లాలోని ఒక రెస్టారెంట్ లో రికార్డ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు రెస్టారెంట్ ఓనర్ ని అరెస్టు చేశారు. ఇలాగే గతవారం ఉత్తర్ ప్రదేశ్ గాజియాబాద్ జిల్లాలో ఒక ఫ్రూట్ జ్యూస్ వెండర్.. కస్టమర్లకు జ్యూస్ లో మూత్రం కలిపి ఇస్తున్నాడని బయటపడింది. నోయిడాలో కూడా మరో జ్యూస్ వెండర్.. కస్టమర్లకు జ్యూస్ లో మద్యం కలిపి ఇస్తున్నాడని తేలింది.

Also Read: కొత్త కోడలు చేసిన వంట తిని తీవ్రంగా నష్టపోయిన కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు! ..


ఈ ఘటనల్నీ వరుసగా వెలుగులోకి వస్తుండడంతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, ఢాబాలు, రెస్టారెంట్లు, ఆహార్ పదార్థాలు విక్రయించే స్ట్రీట్ వెండర్లందరూ తమ దుకాణం బయట నేమ్ బోర్డులో యజమాని, మేనేజర్ లేదా ప్రొప్రైటర్ వివరాలు బహిర్గతం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. వంట చేసే వారు, వెయిటర్లందరూ మాస్కులు, చేతి గ్లోవ్స్ తప్పనిసరిగా ధరించాలి. హోటల్స్, రెస్టారెంట్స్ లో సిసిటీవి కెమెరాలు కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఆహారంలో కల్తీ, మానవ వ్యవర్థాలు, లేదా ఆరోగ్యానికి హానికరమైన ఎటువంటి చెత్త.. కలిపి విక్రయాలు జరిపే వారిపై కఠినంగా చర్యలు చేపట్టాలని సిఎం యోగి ఆదిత్యనాథ్ నిర్దేశించారు.

Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట,  రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ

హోటల్స్ లో కల్తీ భోజనం, మావన వ్యర్థాలు కలిపి విక్రయాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ఆరోగ్యశాఖ అధికారులు ఇటీవల అన్ని హోటల్స్, రెస్టారెంట్స్, ఢాబాలలో తనిఖీలు చేస్తున్నారు. అక్కడ పనిచేసే వంటవాళ్లు, చెఫ్, వెయిటర్లు, ఇతర స్టాఫ్ అందరి వివరాలు కూడా యజమానుల నుంచి సేకరిస్తున్నారు.

అయితే కొన్ని నెలలక్రితం ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కన్వర్ తీర్థ యాత్ర సందర్భంగా హోటల్ యజమానుల పేర్లు నేమ్ బోర్డులో ముద్రించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. కానీ ఇప్పుడు కల్తీ ఆహారం కారణంగా ఇవే ఆదేశాలు మరోసారి జారీ చేయడంపై విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి.

Related News

TVK Vijay: సింగిల్ సింహం.. విజయ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారా?

TVK Maanadu: అడవికి రాజు ఒక్కడే, విజయ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ కి సెటైరా.?

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

PM Removal Bill: బాబు-నితీష్‌ కట్టడికి ఆ బిల్లు.. కాంగ్రెస్ ఆరోపణలు, ఇరకాటంలో బీజేపీ

Online Games Bill: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం.. అలా చేస్తే కోటి రూపాయల జరిమానా

Mumbai floods: ముంబై అల్లకల్లోలం.. మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో..!

Big Stories

×