E-Paper
Advertisement

7 People Died in AP Road Accident: ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు మృతి!

7 People Died in AP Road Accident:  ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు మృతి!
Advertisement
Road Accidents in Andhra Pradesh
Road Accidents in Andhra Pradesh

Seven People Died in AP Road Accident in Single Day: విశాఖ జిల్లా పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పెందుర్తిలోని అక్కిరెడ్డిపాలెం వద్ద చోటు చేసుకుంది.

టాటా ఏసీ వ్యాన్‌ను వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి పేర్లు హనుమంతు ఆనందరావు (45), హనుమంతు శేఖర్ రావు (15), చింతాడి ఇందు (65).

Advertisement

మరోవైపు పాడేరు ఘాట్ రోడ్డు లోయలోకి దూసుకెళ్లింది బొలెరో వాహనం. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏసు ప్రభు కార్నర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులిద్దరూ వలస కూలీలు. ఒడిషా నుంచి విజయవాడ వైపు వస్తున్నారు. దాదాపు 30 మందితో బొలెరో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.క్షతగ్రాతులను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలావుండగా కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గురువారం ఉదయం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు స్పాట్‌లో మృతి చెందారు. మృతులు చల్లపల్లి మండలం పచ్చర్లంక వాసులుగా గుర్తించారు.

Advertisement

Tags

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×