BigTV English

Moto G04s Camera: మోటో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయిన కెమెరా!

Moto G04s Camera: మోటో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయిన కెమెరా!

Moto G04s Price & Specifications: ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రోజుకో కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ప్రజలు కూడా అధునాతమైన ఫీచర్లతో వచ్చే ఫోన్లను వాడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Motorola జర్మనీలో Moto G04s స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ త్వరలోనే దేశీయ మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Motorola G04s ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.


Moto G04s ధర..

Moto G04s ధర లేదా లాంచ్ ‌డేట్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఈ మోటరోలా ఫోన్ కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ వంటి నాలుగు కలర్స్ ఎంపికలలో రానుంది.


Moto G04s ఫీచర్లు..

Moto G04s 720 x 1612 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 269 ppi పిక్సెల్ డెన్సిటీ, 85 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. Moto G04s Unisoc T606 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 4GB RAM, 64GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంటుంది.  ఫోన్ 8GB వరకు వర్చువల్ RAMకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా Motorola MyUXతో వస్తుంది.

Also Read: శ్యామ్‌సంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్

 

Moto G04s
Moto G04s

కెమెరా..

కెమారా గురించి మాట్లాడితే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రెండు కెమెరాలు FHD రికార్డింగ్‌ని 30fps వరకు సపోర్ట్ చేస్తాయి. G04s 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అయితే ఫోన్‌తో పాటుగా 10W ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ సిమ్, 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, NFC, GPS, 3.5mm ఆడియో జాక్, Dolby Atmos ఆడియో సపోర్ట్‌తో సింగిల్ స్పీకర్ ఉంది.

Also Read: నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అంటారు!

Moto G04s దాదాపుగా Moto G04ని పోలి ఉంటుంది. ప్రధాన కెమెరా సెటప్‌లో మాత్రమే తేడా ఉంది. G04s 50 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉండగా.. G04 తక్కువ రిజల్యూషన్ 16 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. G04s ఇప్పటికీ వెనుకవైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×