BigTV English

Samsung Galaxy M55 Launch: శ్యామ్‌సంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర.. ఫీచర్స్..

Samsung Galaxy M55 Launch: శ్యామ్‌సంగ్  నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర.. ఫీచర్స్..
Samsung Galaxy M55
Samsung Galaxy M55

Samsung Launched Galaxy M55 & Galaxy M15: శ్యామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లకు భారతీయ టెక్‌ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్ల కోసం మొబైల్ లవర్స్ ఎప్పుడు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో కంపెనీ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. కంపెనీ మిడ్రేంజ్ సెగ్మెంట్ మార్కెట్లో తన Samsung Galaxy M55, Galaxy M15లను విడుదల  చేసింది. ఈ ఫోన్లో మంచి అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.


శ్యామ్‌సంగ్ Galaxy M55 ధర

ధర గురించి మాట్లాడితే.. Samsung Galaxy M55 8GB + 128GB వేరియంట్ ధర రూ. 26,999 నుండి ప్రారంభమవుతుంది. గెలాక్సీ M15 యొక్క ప్రారంభ ధర రూ. 13,299 గా ఉంది. ఇది దాని 4GB + 128GB వేరియంట్. ఈ రెండు ఫోన్లు  అమెజాన్. సామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.


శ్యామ్‌సంగ్ Galaxy M55 ఫీచర్లు 

Samsung Galaxy M55 ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే.. ఇది 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది స్మూత్ విజువల్స్‌ను అందిస్తుంది. Exynos ప్రాసెసర్ కాకుండా  Samsung Galaxy M55లో Snapdragon 7 Gen 1 SoCని ఉపయోగించారు. ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫోన్ 8GB, 12GB RAM కాన్ఫిగరేషన్‌లలో 265GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది.

Also Read: రెడ్ మీ నుంచి 200 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. కెమెరా ఫీచర్స్ అదుర్స్!

శ్యామ్‌సంగ్ Galaxy M55 కెమెరా

Samsung Galaxy M55 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా,  2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెటప్‌లు ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్ హై రిజల్యూషన్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉంది. 5000mAh బ్యాటరీ, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

శ్యామ్‌సంగ్ Galaxy M15 ఫీచర్లు

Samsung Galaxy M15 ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఈ ఫోన్ 6.5-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6100+ చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. ఇది 128GB వరకు స్టోరేజ్, 4GB, 6GB RAM వేరియంట్‌లలో లభిస్తుంది.

Also Read: అరేయ్ ఏంది మామా ఇది.. రూ.12వేల స్మార్ట్ వాచ్.. కేవలం రూ.118కే!

శ్యామ్‌సంగ్ Galaxy M15 కెమెరా

Samsung Galaxy M15 ట్రిపుల్ కెమెరా సెటప్‌‌తో వస్తుంది. కలిగి . ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అలానే 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమారాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.  6000mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×