E-Paper
Advertisement

మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!

మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!
Advertisement

Meta Muse Voice: ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో మాట్లాడాలంటే చాట్ చేయడం, ప్రశ్నలు టైప్ చేయడం తప్ప మరో మార్గం లేదు. కానీ ఇక ఆ అవసరం లేకుండానే ఫోన్ కాల్‌లో మాట్లాడినట్టుగా ఏఐతో ముచ్చటించవచ్చు. అవును.. మెటా తమ ఏఐ అసిస్టెంట్‌లో సరికొత్త Muse Voice ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇందులో విశేషం ఏంటంటే.. మనం మాట్లాడుతున్నప్పుడు ఏఐ కూడా మనిషిలా ముఖ కవళికలు, చేతి సంజ్ఞలతో స్పందిస్తుంది. మన మాటలకు తగ్గట్టుగా తన హావభావాలను మార్చుకుంటుంది. దీంతో స్క్రీన్‌పై కనిపించే ఏఐ అవతార్‌తో మాట్లాడుతున్నామా, ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడా అన్నంత సహజమైన అనుభూతి కలగనుంది. ఏఐతో మాట్లాడే విధానాన్నే మార్చేలా ఉన్న ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తి పెంచుతోంది.

Muse Voice అంటే?

మెటా తీసుకొచ్చిన Muse Voice ఫీచర్.. ఆ సంస్థకు చెందిన Muse AI అసిస్టెంట్‌లో కొత్త అప్‌డేట్. దీని సాయంతో యూజర్లు ఏఐతో రియల్ టైమ్‌లో మాట్లాడవచ్చు. మొబైల్, వెబ్, మ్యాక్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. అప్‌డేట్ వచ్చిన యూజర్లు ఫోన్ ఐకాన్‌పై క్లిక్ చేసి సంభాషణ మొదలుపెట్టవచ్చు. మనం అడిగిన ప్రశ్నలకు ఏఐ వెంటనే స్పందిస్తుంది. మధ్యలోనే దాని మాటలను ఆపి మరో ప్రశ్న అడిగే అవకాశం కూడా ఉంది.

మూడు రకాలుగా మాట్లాడొచ్చు:

Advertisement

ఈ ఫీచర్‌లో యూజర్లకు మూడు ఆప్షన్లు ఉన్నాయి. వీడియో కాల్‌లా అవతార్‌తో ముఖాముఖి మాట్లాడవచ్చు. చాట్ పక్కనే అవతార్ కనిపించేలా చేసుకోవచ్చు. లేదా అవతార్ లేకుండా కేవలం వాయిస్‌తోనే సంభాషించవచ్చు. Muse Realtime Avatar సాయంతో మన మాటల్లోని భావానికి తగ్గట్టుగా అవతార్ ముఖ కవళికలు, హావభావాలు మారతాయి. అంతేకాదు.. వందల రకాల వాయిస్‌లు, స్టైల్స్‌లో నచ్చినదాన్ని ఎంచుకుని మన Museకు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వొచ్చు.

Also Read: రూ.200 లోపే అన్‌లిమిటెడ్ కాలింగ్.. Jio, Airtel, Vi వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఏది బెటర్ అంటే?

పనులు కూడా చేసిపెడుతుంది:

Advertisement

Muse కేవలం మాట్లాడటానికే పరిమితం కాదు. సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారం వెతకడం వంటి పనులతో పాటు ఏజెంటిక్ ఏఐ సామర్థ్యాలతో కొన్ని పనులను కూడా పూర్తి చేయగలదు. అలాగే దీర్ఘకాలిక మెమరీ ఉండటం వల్ల గత సంభాషణల్లోని విషయాలను గుర్తుంచుకోగలదు. ఇది సాధారణ Meta AI చాట్‌బాట్‌కు భిన్నమైన ప్రత్యేకత.

భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది?

ప్రస్తుతం Muse Voice ఫీచర్ అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర మార్కెట్లకు కూడా తీసుకొస్తామని మెటా తెలిపింది. అయితే భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. భవిష్యత్తులో Meta AI గ్లాసెస్‌తో పాటు రాబోయే Muse Charm పరికరంలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Also Read: పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!

Tags

Related News

రూ.200 లోపే అన్‌లిమిటెడ్ కాలింగ్.. Jio, Airtel, Vi వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఏది బెటర్ అంటే?

జియో కనివిని ఎరుగని ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 36 నెలలు తిరుగే లేదు.. అపరిమిత 5G, ఫ్రీ కాల్స్, ఓటీటీ సేవలు!

భూమికి మరో చంద్రుడు.. రహస్యంగా చక్కర్లు కొడుతూ, ఎట్టకేలకు దొరికేశాడు!

రూ.581కే..పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్!డోంట్ మిస్

రూ.401కే 5W పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్..బేస్ అదిరిపోతుంది

ఓట్స్‌తో హెల్దీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్..5 నిమిషాల్లో రెడీ అవుతుంది

యూట్యూబ్ యాప్‌లో భారీ మార్పులు.. సబ్‌స్క్రిప్షన్స్ ట్యాబ్ మాయం.. కొత్తగా ఏమొచ్చాయంటే?

Big Stories

Advertisement
×