BigTV English

Whats App Reverse Search Image : క్లిక్ కొట్టు.. ఫేక్ ఫోటో పట్టు.. అలరించబోతున్న వాట్సాప్ కొత్త ఫీచర్

Whats App Reverse Search Image : క్లిక్ కొట్టు.. ఫేక్ ఫోటో పట్టు.. అలరించబోతున్న వాట్సాప్ కొత్త ఫీచర్

Whats App Reverse Search Image : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటాకు చెందిన ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటికే కస్టమర్స్ సౌకర్యార్ధం కొత్త ఫీచర్స్ ను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా అదిరిపోయే అప్డేట్ ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఒక్క అప్డేట్ తో మోసం చేస్తూ తప్పుడు ఫోటోలను పంపేవాళ్లని ఇట్టే పసిగట్టేయెుచ్చు.


పాపులర్ మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన WhatsApp… చాట్‌లో షేర్ చేసిన ఫోటోలు నిజమా.. కాదా అని తేలికగా తెలుసుకోటానికి వీలయ్యే కొత్త ఫీచర్‌పై కసరత్తులు చేస్తుంది. ఇందుకోసం వినియోగదారులు ఇప్పటివరకూ గూగుల్ లో రివర్స్ సర్చ్ ఇమేజ్ ను ఉపయోగించేవారు. ఈ అప్డేట్ అందుబాటులోకి వస్తే ఇకపై నేరుగా వాట్సాప్ ఫోటోలను తనిఖీ చేసి అసలు విషయం చెప్పేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటా యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

వాట్సాప్‌లో ఇమేజ్ వెరిఫికేషన్ WABetaInfoతో చేసే వాట్సాప్ తెస్తున్న ఈ ఫీచర్ తో నేరుగా మోసం చేసే వాళ్లను గుర్తించవచ్చు. ఇందుకోసం వాట్సాప్ లో కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. Search on the web ఆఫ్షన్ పై క్లిక్ చేసి… మెనూపైన ఉన్న త్రీ డాట్స్ ను క్లిక్ చేయాలి. గూగుల్ లో రివర్స్ సర్చ్ ఇమేజ్ ను సర్చ్ చేసినట్లే ఇందులో కూడా సర్చ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఆఫ్షన్ ను వాట్సాప్ లోనే ఇవ్వటంతో యూజర్ కు పని తేలికవ్వటమే కాకుండా చాలా సమయం ఆదా అవుతుంది. ఇంకా తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా ఉంటుంది.


రివర్స్ సర్చ్ ఇమేజ్ ఆఫ్షన్ తో ఉపయోగాలు –

వాట్సాప్ కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు. సమాచారాన్ని చేరవేసేందుకు యూజర్స్ ఉపయోగించే బెస్ట్ ఆఫ్షన్. ఈ రోజుల్లో కమ్యూనికేషన్స్ కు ప్రాథమిక సాధనం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి మాత్రమే కాకుండా వార్తలు, అప్‌డేట్స్ తెలుసుకోటానికి ఉపయోగిస్తారు. మరి ఇందులో నిజమైన సమాచారాన్ని మాత్రమే పంచుకోవటం ఎంతో అవసరం. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారాన్ని నిజమా.. కాదా అనే విషయాన్ని తెలుసుకోటానికి యూజర్ ఎక్కువ కష్టపడక్కర్లేదు.

2020లో వాట్సాప్ లింక్ వెరిఫికేషన్ కోసం ఇదే విధమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. వెబ్‌లో అనుమానాస్పద లింక్స్ కోసం తెలుసుకోటానికి ఈ ఫీచర్ బెస్ట్ ఆఫ్షన్ గా పనిచేసింది. ఇక ప్రస్తుతం దీన్ని మరింత మెరుగుపరుస్తూ రివర్స్ సర్చ్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫ్షన్ పై బీటా యూజర్స్ కు మాత్రమే. నాన్ బీటా వినియోగదారుల కోసం త్వరలోనే WABetaInfo ఆఫ్షన్ ను తెచ్చేందుకు వాట్సాప్ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉన్న ఈ ఆఫ్షన్ త్వరలోనే అందరికీ అందుబాటులో రానున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ ఫీచర్ వాట్సాప్ యాప్‌లో చేరుతుందా…లేదా అనే విషయం ప్రస్తుతానికి తెలియలేదు. బీటా ఫీచర్‌తో పాటు ఇమేజ్ సెర్చ్‌ యాప్ రావటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనప్పటికీ, తప్పుడు సమాచారాన్ని తేలికగా కనిపెట్టటానికి ఈ ఫీచర్ బెస్ట్ ఆఫ్షన్.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×