Big Stories

Motorola X50 Ultra Launch: 125W ఫాస్ట్ ఛార్జింగ్, 1 TB స్టోరేజ్‌తో మోటో కొత్త ఫోన్.. మే 16న లాంచ్..!

Motorola X50 Ultra Launching on May 16th: మోటరోలా ఈ ఏడాదిలో గ్యాప్ లేకుండా అనేక లైనప్‌లలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తుంది. కంపెనీ అతి త్వరలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తన కస్టమర్ల కోసం కొత్త హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ  Motorola X50 Ultra ఫోన్ తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మే 16న చైనీస్ మార్కెట్‌లోకి లాంచ్ అవుతుంది. భారత్‌లో కూడా త్వరలోనే లాంచ్ అయే అవకాశం ఉంది.

- Advertisement -

మోటరోలా కొత్త హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 16 GB LPDDR5X RAM ఉంటుంది. 1 TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ Android 14 OSతో వస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ X50 అల్ట్రాలో చూడొచ్చు. దీని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అధికారిక టీజర్‌లో కనిపించే ఫోన్ బీజ్ కలర్ ఆప్షన్‌లో కనిపిస్తుంది.

- Advertisement -

Also Read: రూ.15వేలకే 11000mAh బ్యాటరీ, 64MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. త్వరలో లాంచ్!

ఈ ఫోన్‌లో 4500 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 125 W వైర్డు, 50 W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. రాబోయే మోటో ఫోన్  కలర్ వేరియంట్‌లు చాలా డీసెంట్‌గా ఉంటాయని టీజర్ చూపిస్తుంది. ఇది ఎడ్జ్ 50 అల్ట్రా యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అయితే చాలా ఫీచర్లు కూడా అదే ఫోన్‌ నుంచి తీసుకొనే అవకాశం ఉంది.

ఈ ఫోన్ ఎడ్జ్ 50 అల్ట్రా యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అయితే రెండు ఫోన్‌ల స్పెక్స్ ఒకే విధంగా ఉంటాయి. Motorola X50 అల్ట్రా 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 2500 nits పీక్ బ్రైట్‌నెస్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. కొత్త Motorola ఫోన్‌ని Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌తో తీసుకురావచ్చు. స్క్రీన్-టు-బాడీ రేషియో 93.8 శాతం.

Also Read: వివో ఫోటోల ఫోన్ సేల్ మొదలైంది.. అదిరిపోయే ఆఫర్లు!

చైనా టీనా జాబితా ప్రకారం  Moto X50 Ultra 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 8GB, 12GB, 16GB, 18GB RAM+ 128GB, 256GB, 512GB ,1TB స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది 3.19GHz పీక్ ఫ్రీక్వెన్సీతో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఇది Qualcomm Snapdragon 8s Gen 3 SoCకి సూచన. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 64-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్ ఫ్రంట్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News