BigTV English

Gangs of Godavari Postponed: మళ్లీ వెనక్కి వెళ్లిన లంకల రత్న.. ఆ సెంటిమెంట్ కోసమా..?

Gangs of Godavari Postponed: మళ్లీ వెనక్కి వెళ్లిన లంకల రత్న.. ఆ సెంటిమెంట్ కోసమా..?

Gangs Of Godavari Postponed again: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సాయి సౌజన్య మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


మే 17 న ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. సినిమా రిలీజ్ కు ఇంకా వారం ఉందన్న సమయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. అసలు చెప్పాలంటే ఈపాటికే ఈ సినిమా రిలీజ్ అయ్యిపోయి ఉండాలి. కొన్ని కారణాల వలన మే 17 కు వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు మే 31 న వస్తుందని తెలిపారు. అయితే ఎందుకు వాయిదా పడింది అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఆరోజు సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని మేకర్స్ తెలిపారు.

5 ఏళ్ళ క్రితం అదే రోజున విశ్వక్ నటించి, దర్శకత్వం వహించిన ఫలక్ నామా దాస్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే డేట్ న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో మళ్లీ విశ్వక్ వస్తున్నాడు. ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇకపోతే మే 31 న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. సుధీర్ బాబు హరోంహర, కార్తికేయ భజే వాయువేగం, కాజల్ సత్యభామ, ఆనంద్ దేవరకొండ గం..గం.. గణేశా..తో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలతో పోటీపడి లంకల రత్న ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Also Read: OMG Movie Teaser: భయపెట్టడానికి హీరోయిన్ తో కలిసివస్తున్న స్టార్ కమెడియన్..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×