Noise Air Clips OWS : నాయిస్ ఎయిర్ క్లిప్స్ ఇండియాలో లాంఛ్ అయ్యాయి. వీటి ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ధర సైతం అందుబాటులోనే ఉంది. ఇందులో 40గంటల ప్లేబ్యాక్, డ్యూయల్ డివైజ్ సిస్టమ్ సైతం ఉంది. క్రోమ్ ఫినిషింగ్‌తో ఓపెన్ బీమ్ డిజైన్‌తో వచ్చేసిన ఈ ఎయిర్ క్లిప్స్ లో నాయిస్ ఎయిర్ వేవ్ టెక్నాలజీ సైతం ఉంది.
ఆడియో వేరబుల్ కంపెనీ నాయిస్.. తన ఎయిర్ క్లిప్స్ ఇయర్‌ఫోన్‌లను భారత్ లో లాంఛ్ చేసింది. ఓపెన్ బీమ్ డిజైన్‌తో ఈ ఇయర్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఇక ఇవి ఇప్పుడున్న ఇయర్‌ఫోన్‌లకు సరికొత్త డిజైన్ అనే చెప్పవచ్చు. నాయిస్ ఎయిర్‌వేవ్ టెక్నాలజీని ఇయర్‌ఫోన్‌లలో ఖచ్చితమైన ఎయిర్ కండక్షన్ మెకానిజమ్‌లతో ఉపయోగించింది. దీంతో అవి 12mm డ్రైవర్లతో వచ్చేశాయి. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీని సైతం అందిస్తాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు IPX5 రేటింగ్‌తో వస్తున్నాయి. ఇక ఈ నాయిస్ ఎయిర్ క్లిప్స్ క్రోమ్ ఫినిషింగ్‌తో ఓపెన్ బీమ్ డిజైన్‌తో వచ్చేశాయి. ఇది నాయిస్ ఎయిర్ వేవ్ టెక్నాలజీతో ఉంది.
Noise Air Clips OWS Specification
నాయిస్ ఎయిర్ క్లిప్స్ OWS స్పెసిఫికేషన్‌లు –
ఈ నాయిస్ ఎయిర్ క్లిప్స్ క్రోమ్ ఫినిషింగ్ ఓపెన్ బీమ్ డిజైన్‌తో లాంఛ్ అయింది. ఇది నాయిస్ ఎయిర్‌వేవ్ టెక్నాలజీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.4ను అందిస్తుంది. టచ్ కంట్రోల్‌లు, డ్యూయల్ డివైస్ ను ఎటాచ్ చేశారు. ఇక మొత్తం ప్లేబ్యాక్ సమయాన్ని 40 గంటల వరకు కూడా పొందే అవకాశం ఉంది. ఇక ఈ ఎయిర్ క్లిప్స్ పెర్ల్ వైట్, పెర్ల్ బ్లాక్, పెర్ల్ పర్పుల్‌తో సహా మూడు రంగులలో వచ్చేసింది.
ఇంకా ఈ నాయిస్ ఎయిర్ క్లిప్‌లను ఇన్‌స్టాఛార్జ్ చేయవచ్చు. అంటే 150 నిమిషాల ప్లేటైమ్‌ని అందిస్తూ 10 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది IPX5 వాటర్ రెసిస్టెంట్ తో అత్యంత తేలికగా కేవలం 5.4 గ్రాముల బరువు మాత్రమే ఉంది. ఇది 4.6 x 5.4 x 2.8 సెం.మీ. ఇతర ఫీచర్లలో రెస్పాన్సివ్ టచ్ కంట్రోల్స్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, ఇన్ ఇయర్ డిటెక్షన్, వాయిస్ అసిస్టెంట్ – సిరితో వచ్చేసింది. ఇంకా ఇందులో గూగుల్ అసిస్టెంట్ డ్యూయల్ డివైస్ పెయిరింగ్ సైతం ఉన్నాయి.
Noise Air Clips OWS Price
నాయిస్ ఎయిర్ క్లిప్స్ OWS ధర –
ఈ నాయిస్ ఎయిర్ క్లిప్స్ OWSని రూ.2,999కి లాంచ్ చేసింది ఆ సంస్థ. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపు ఆఫర్‌లను కూడా ఉంది. నాయిస్ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో సహా ఇ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా 7 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ, ఏడాది వారంటీని సైతం అందిస్తోంది. అది తక్కువ ధరకే బెస్ట్ హెయిర్ క్లిప్స్ అని చెప్పవచ్చు. ఇక నాయిస్ లాంఛ్ చేసిన ఈ ఎయిర్ క్లిప్స్ ను మీరూ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి.
ALSO READ : 20కుపైగా దేశాల్లో అమెజాన్ ఉద్యోగస్థుల సమ్మె – ఎందుకంటే?