BigTV English

Pushpa 2 Pre Release Event: ‘ఊ అంటావా’తో ‘కిసిక్‌’కు పోలికలు.. శ్రీలీల రియాక్షన్ ఏంటంటే?

Pushpa 2 Pre Release Event: ‘ఊ అంటావా’తో ‘కిసిక్‌’కు పోలికలు.. శ్రీలీల రియాక్షన్ ఏంటంటే?

Pushpa 2 Pre Release Event: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీ చాలా రకాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ టీమ్ చేస్తున్న ప్రతీ ప్రమోషనల్ ఈవెంట్ భారీగా సక్సెస్ అవుతోంది. వీటి వల్ల సినిమాపై హైప్ కూడా క్రియేట్ అయ్యింది. అలాగే ‘పుష్ప 2’ టీజర్, ట్రైలర్‌కు ఎంత రీచ్ వచ్చిందో.. ఇందులోని పాటలకు కూడా అదే విధంగా రీచ్ వచ్చింది. ‘పుష్ప 2’ నుండి ఒక పాట విడుదలయితే చాలు.. అది వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతోంది. ‘కిసిక్’ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ‘కిసిక్’ పాటను ‘ఊ అంటావా’తో పోలుస్తూ నెటిజన్లు చాలానే కామెంట్స్ చేశారు. తాజాగా ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ పోలికలపై రియాక్ట్ అయ్యింది శ్రీలీల.


సమంతను బీట్ చేయడం కోసం

సుకుమార్ దర్శకత్వం వహించే దాదాపు ప్రతీ సినిమాలో హైలెట్‌గా నిలిచే అంశం ఐటెమ్ సాంగ్స్. ఆయన దర్శకత్వం వహించిన దాదాపు ప్రతీ సినిమాలో ఒక గుర్తుండిపోయే ఐటెమ్ సాంగ్‌ను చేర్చారు సుకుమార్. అలాంటి ‘పుష్ప’లో కూడా ఐటెమ్ సాంగ్ చేయడానికి సమంతను ఒప్పించారు. తనతో ‘ఊ అంటావా’ అనే పాటకు స్పెప్పులు వేయించారు. ఈ పాట ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సమంత ఒక ఐటెమ్ సాంగ్‌లో నటించడం అనేది అప్పట్లో ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇక ‘పుష్ప 2’లో ‘ఊ అంటావా’ను డామినేట్ చేయడం కోసం శ్రీలీలను రంగంలోకి దించి తనతో ‘కిసిక్’ అనే పాట చేయించారు.


Also Read: ‘పుష్ప 2’కు లీగల్ కష్టాలు.. టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్

సమంతతో పోలికపై కామెంట్

‘కిసిక్’ పాట విడుదలయినప్పటి నుండి సమంత చేసిన ‘ఊ అంటావా’తోనే పోల్చడం మొదలుపెట్టారు నెటిజన్లు. శ్రీలీలకు సమంతకు ఉన్నంత గ్రేస్ లేదని, పాట ఫ్లాప్ అని.. ఇలా చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. తాజాగా ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ కామెంట్స్‌ను శ్రీలీలకు చదివి వినిపించారు సుమ. అసలు శ్రీలీల ‘కిసిక్’ పాటకు నెటిజన్ల రియాక్షన్ ఏంటని చూపించారు. అందులో చాలావరకు పాజిటివ్ రియాక్షన్సే ఉండడంతో శ్రీలీల సంతోషించింది. కానీ చివర్లో సమంత ఫోటోను, శ్రీలీల ఫోటోను పక్కపక్కనే పెట్టి జనాలు ఊ అంటావాను ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, కిసిక్‌ను ఎక్కువ ఎంజాయ్ చేస్తారా అనే కామెంట్‌ను వినిపించింది.

కిసిక్ గర్ల్‌గా మార్చేశారు

సమంతతో పోలుస్తున్నారని తెలిసినా ఈ కామెంట్‌కు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది శ్రీలీల. ‘‘జనాలు కిసిక్ పాటకు ఊ అంటావా అంటారు’’అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది శ్రీలీల. మొత్తానికి ‘కిసిక్’ పాట విడుదలయినప్పుడు అందరూ దానిని ట్రోల్ చేసినా.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతోంది. అంతే కాకుండా చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు.. ఈ పాటపై రీల్స్ చేసి దీనిని మరింత ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవీ శ్రీ ప్రసాద్ ఎంటర్ అవ్వగానే తానే స్పెషల్‌గా వెల్‌కమ్ చెప్పింది శ్రీలీల. దేవీ శ్రీ ప్రసాద్ వల్లే తాను ‘కిసిక్ గర్ల్’గా మారిపోయానని తెలిపింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×