HMD Pulse+ Smart Phone Business Edition: నోకియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ హెచ్‌ఎండీ పల్స్+ బిజినెస్ ఎడిషన్ ఫోన్‌ను విడుదల చేసింది. కొత్త HMD స్మార్ట్‌ఫోన్‌లు వ్యాపారంపై దృష్టి సారించే టన్నుల ఫీచర్లతో వస్తాయి. ఇది నెట్‌వర్క్ లాక్‌డౌన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఫోన్ సెటప్ సమయంలో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కూడా ఆఫ్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో వినియోగదారులకు 3 సంవత్సరాల వారంటీ, 5 సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.
HMD పల్స్+ బిజినెస్ ఎడిషన్ యూరోప్‌లో తీసుకొచ్చారు. ఇక్కడ దీని ధర యూరో 199 అంటే దీని ధర ఇండియన్ కరెన్సీలో రూ. 18,033. పల్స్+ బిజినెస్ ఎడిషన్ స్పెసిఫికేషన్‌లు విషయానికి వస్తే ఇందులో చాలా ఫీచర్లు ఉన్నప్పటికీ చాలా ప్రత్యేకమైనది ఫర్మ్‌వేర్-ఓవర్-ది-ఎయిర్ (FOTA) సర్వీస్ ఫోన్‌లో ఉంది. దీని సహాయంతో వ్యాపార వినియోగదారులు వేరే మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను ఉపయోగించవచ్చు.
Also Read: రియల్‌మీ P1 Pro 5G ఫోన్‌పై ఆఫర్ల వర్షం.. 24 గంటలే ఛాన్స్!
HMD పల్స్+ బిజినెస్ ఎడిషన్‌కు కంపెనీ రిపేరబుల్ సొల్యూషన్‌ను కూడా తీసుకువచ్చింది. అంటే ఫోన్ పార్ట్స్‌ను సులభంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఐఫిక్సిట్‌తో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫోన్‌లో పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు కంపెనీ డోర్ టు డోర్ కేర్ సర్వీస్‌ను అందిస్తోంది. ఫోన్ ఆప్రికాట్ క్రష్ కలర్‌లో ఉంటుంది. ఇది గ్లేసియర్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ రంగులలో కూడా లభిస్తుంది.
HMD పల్స్+ బిజినెస్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది . పల్స్+ బిజినెస్ ఎడిషన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్. ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వినియోగదారులు ఇంట్లో కూర్చొని బ్యాటరీ మార్చుకోవచ్చని పేర్కొన్నారు.
Also Read: ప్రపంచంలోనే అతి చిన్న ఫ్లిప్ ఫోన్ లాంచ్.. దీని స్పెషల్ ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు..!
HMD పల్స్+ బిజినెస్ ఎడిషన్ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం NFC, WiFi, బ్లూటూత్ 5.0 ఫీచర్ అందుబాటులో ఉంది. ఒక USB టైప్-C 2.0 పోర్ట్ ఉంది. కొత్త HMD ఫోన్‌లో Unisock T606 ప్రాసెసర్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇందులో 6 జీబీ ర్యామ్ అలాగే 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫోన్ బరువు 187 గ్రాములుగా ఉంది. HMD కంపెనీ నోకియా ఫోన్లను రీ బ్రాండిగ్ చేస్తున్న విషయం మనందరకి తెలిసిందే.