Nothing Phone 2a : ప్రీమియం మొబైల్స్ ను అందుబాటు ధరల్లోనే తీసుకొస్తున్న టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొచ్చేసింది. ఇక తాజాగా నథింగ్ ఫోన్ 2aను సైతం లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. బెస్ట్ బడ్జెట్ మొబైల్ గా ఉన్న ఈ ఫోన్లో ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ ఏ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఈ మొబైల్ పై అదిరిపోయే ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ లో కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 20వేల కంటే తక్కువకే ఫోన్ కూడా ఛాన్స్ ఉంది.
Nothing Phone 2aపై ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ ను అందిస్తుంది. HDFC బ్యాంక్ తగ్గింపు తర్వాత ఈ మెుబైల్ ను రూ.18,999కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది. కస్టమర్స్ రూ. 24,050 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, నో కాస్ట్ EMI సదుపాయం సైతం పొందే ఛాన్స్ ఉంది.
బెస్ట్ డిజైన్, ఫీచర్‌లతో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే యూజర్స్ కు Flipkart నథింగ్ ఫోన్ 2a డీల్ బెస్ట్ ఆఫ్షన్. రూ. 24,999 కే మిడ్ రేంజ్ మెుబైల్ గా ఉన్న ఈ స్మార్ట్ గ్యాడ్జెట్… ఇప్పుడు Flipkartలో రూ. 20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మాన్యుమెంటల్ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్స్ సైతం అదిరేలా ఉన్నాయి. ఇందులో ఫీచర్స్ సైతం అదిరేలా ఉన్నాయి. MediaTek డైమెన్సిటీ 7200 ప్రో, డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చేసింది.
Flipkart ఆఫర్ –
నథింగ్ ఫోన్ 2a ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,999గా ఉంది. ఈ ధర 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం. అదనంగా, వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. దీన్ని రూ.18,999కే కొనుగోలు చేయవచ్చు. ఇక కస్టమర్లు రూ. 24,050 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. నెలకు రూ. 7,000 నుండి నో-కాస్ట్ EMIను పొందవచ్చు.
Nothing Phone 2a Specifications –
Nothing Phone 2a మెుబైల్ 6.7 అంగుళాల 120hz FHD+ AMOLED డిస్ ప్లేతో వచ్చేసింది. ఇది HDR10+కి సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ మెుబైల్ లో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7200 Pro చిప్‌సెట్ తో పనిచేస్తుంది. గరిష్టంగా 12GB RAM + 256GB స్టోరేజ్ తో వచ్చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఇక ఈ మెబైల్ కెమెరా విషయానికొస్తే… 50MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఇందులో 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైతం ఉంది. ఈ మెుబైల్ లో IP54 సర్టిఫికేషన్ కుడా ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం కొనాలనుకునే యూజర్స్ వెంటనే ట్రై చేసేయండి.
ALSO READ : ఇస్రోకి మరింత శక్తి.. మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్