BigTV English

Allu Arjun: బన్నీ- త్రివిక్రమ్ అనౌన్స్ మెంట్.. ఆ వీడియోతో వస్తుందంట..?

Allu Arjun: బన్నీ- త్రివిక్రమ్ అనౌన్స్ మెంట్.. ఆ వీడియోతో వస్తుందంట..?

Allu Arjun: అల్లు అర్జున్  గతేడాది పుష్ప 2 సినిమాతో ఎంత భారీ విజయాన్ని అందుకున్నాడో.. అంతకుమించిన వివాదంలో కూడా ఇరుక్కున్నాడు.  సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం  బన్నీ మెడకు చుట్టుకుంది. థియేటర్ కు పర్మిషన్ లేకుండా బన్నీ వచ్చినందుకే ఆ తొక్కిసలాట జరగడం, అందులో  రేవతి మృతి చెందడం జరిగిందని  పోలీసులు బన్నీపై కేసు  పెట్టడం  రెండు సార్లు విచారణకు పిలవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కూడా బన్నీ బెయిల్ పైనే బయట ఉన్నాడు.


ఇక ఇదంతా పక్కన పెడితే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది.  వివాదాలు కాకుండా   కెరీర్ పరంగా బన్నీ ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చూపు అంతా బాలీవుడ్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ముంబైకి వెళ్లి బడా డైరెక్టర్లను కలిసిన్నట్లు టాక్ నడుస్తోంది. ఇక తెలుగులో అయితే పుష్ప 2 తరువాత త్రివిక్రమ్- అల్లు అర్జున్  సినిమాను పట్టాలెక్కించన్నాడు బన్నీ.

టాలీవుడ్ లో కొన్ని కాంబోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా హిట్ కాంబోస్ పై మరింత హైప్ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో హిట్ కాంబోగా పేరుతెచ్చుకున్నారు.. హీరో అల్లు అర్జున్ – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో. ఈ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.


Sandeep Reddy Vanga: యో.. సందీప్ రెడ్డి.. జనాలను ఇంత మోసం చేస్తావా.. ?

త్రివిక్రమ్ రైటింగ్ గురించి, డైలాగ్స్ గురించి ప్రేక్షకులకు అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ కు కూడా ఫ్యానిజం ఉంది అంటే అది గురూజీ నుంచే మొదలయ్యిందని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ కు హిట్స్ లేవు.  గతేడాది గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ – త్రివిక్రమ్ ఈ కాంబో కూడా పెద్ద హిట్ నే. అది కాకుండ రాజమౌళి సినిమా కన్నా ముందు మహేష్ నటించిన చిత్రం కావడంతో.. ఎలా ఉంటుందో అనే ఆత్రుత తో ఫ్యాన్స్ థియేటర్ కు వెళ్లారు. ఊసురుమంటూ బయటకు వచ్చారు.

ఇక గుంటూరు కారం తరువాత త్రివిక్రమ్ చాలా రేర్ గా బయట కనిపిస్తున్నాడు.   ఈ సినిమా తరువాత గురూజీ, బన్నీతో ఒక సినిమా చేయబోతున్నాడు. డైనమిక్ డ్యూ అంటూ మేకర్స్ ఇప్పటికే ఈ కాంబో ను అధికారికంగా ప్రకటించారు. గత ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వలన  జరగలేదు.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివర్లోనే ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లనుందట. దానికి ముందే ఒక అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఒక వీడియో రూపంలో ఈ అనౌన్స్ మెంట్ ను చేయనున్నారట. ఆ వీడియోలో బన్నీ- త్రివిక్రమ్ కు సంబంధించిన కొన్ని పిక్స్, వీడియోస్ ను  కలిపి చివరగా కొత్త సినిమా లుక్ ను రివీల్ చేస్తారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అనౌన్స్ మెంట్ వీడియో వచ్చేవరకు ఆగాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×