BigTV English

Chandrababu – Nitish Kumar Reddy: సీఎం చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్…రూ. 25 లక్షల చెక్ అందజేత

Chandrababu – Nitish Kumar Reddy: సీఎం చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్…రూ. 25 లక్షల చెక్ అందజేత

Chandrababu – Nitish Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ( Chandrababu ) టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) కలవడం జరిగింది. కాసేపటి క్రితమే చంద్రబాబు సీఎం క్యాంప్ ఆఫీస్ కు టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం.. వెళ్ళింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఆయన తండ్రి ముత్యాల రెడ్డి సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు ( Chandrababu ) ఆదేశాల మేరకే… ఇవాళ నితీష్ కుమార్ రెడ్డి, ముత్యాల రెడ్డి ( Muthyala Reddy ) సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లడం జరిగింది.


Also Read: Mumbai Cricket Association: వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు.. గ్రౌండ్ స్టాఫ్ కి MCA అదిరిపోయే గిఫ్ట్స్

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఈ సమావేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ( Andhra Cricket Association ) సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇందులో కేశినేని చిన్ని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ( Nitish Kumar Reddy ) చెక్కు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తర్వాత… ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 25 లక్షల రూపాయలను ( 25 Lakh cheque ) నితీష్ కుమార్ రెడ్డికి… ప్రకటించింది.


అయితే ఆ 25 లక్షల చెక్ ను సీఎం చంద్రబాబు నాయుడు.. చేతుల మీదుగా నితీష్ కుమార్ రెడ్డి అందుకోవడం జరిగింది. ముత్యాల రెడ్డి అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరికీ కలిపి ఆ చెక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: Virat Kohli House: కోహ్లీ కొత్త ఇల్లు ఇదే..32 కోట్లతో రెడీ.. గృహ ప్రవేశం ఎప్పుడంటే ?

ఇది ఇలా ఉండగా… మొన్న ఆస్ట్రేలియా.. టూర్ లో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి… ప్రస్తుతం విశాఖ లోని తన ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మోకాళ్ళపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నితీష్ కుమార్. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా నితీష్ కుమార్ రెడ్డి షేర్ చేశారు. ఇక.. ఆ తర్వాత… సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. కోడి పందాలు నిర్వహిస్తున్న భీమవరానికి వెళ్ళాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా సాధారణ పౌరుడి లాగానే… వాళ్లతో కలిసి కోడిపందాలను వీక్షించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇక లేటెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కూడా నితీష్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ కలిసింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×