E-Paper
Advertisement

Nothing Sub-Brand CMF First Smartphone: నథింగ్ ఫోన్ 2a సబ్ బ్రాండ్ CMF నుంచి తొలి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!

Nothing Sub-Brand CMF First Smartphone: నథింగ్ ఫోన్ 2a సబ్ బ్రాండ్ CMF నుంచి తొలి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
Advertisement

Nothing sub-brand CMF to launch their first ever smartphone: నథింగ్ ఫోన్ 2a సబ్ బ్రాండ్ CMF భారతీయ మార్కెట్లో తమ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కాగా ఈ CMF బ్రాండ్ ఇటీవల ఒక ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, నెక్ బ్యాండ్, ఛార్జర్‌లను రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు CMF మరో అడుగు ముందుకేసింది.

ఈ క్రమంలో తన తొలి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దీనిని CMF Phone (1)గా అని పిలుస్తారు. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే లభిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

Advertisement

లీక్ ప్రకారం.. CMF ఫోన్ (1) దాదాపు రూ.12,000 ధర ట్యాగ్‌తో భారతీయ మార్కెట్లోకి రావచ్చని సమాచారం. ఇది రూ. 23,999 ధరలో ఉన్న నథింగ్ ఫోన్ 2a కంటే చాలా చౌకగా ఉంటుంది. నథింగ్ ఆఫర్‌లతో పోలిస్తే CMF తొలి ఫోన్ మరింత బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటుంది. దాని నిర్మాణం విషయానికొస్తే.. CMF ఫోన్ (1) ఒక ప్లాస్టిక్ బాడీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంట్రీ-లెవల్ డివైజ్‌కు సరైన ఎంపిక. అలాగే దీనికి సేఫ్టీగా ఫోన్ ముందు భాగంలో కొన్ని రకాల గొరిల్లా గ్లాస్‌లను అందించినట్లు తెలుస్తోంది. కాగా ఇది ఆరెంజ్, తెలుపు, నలుపు వంటి మూడు కలర్ ఆప్షన్లలో రావచ్చని సమాచారం.

Also Read: ఆఫర్ల జాతర.. బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, నెక్‌బ్యాండ్‌లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు!

Advertisement

అలాగే దీని స్పెసిఫికేషన్‌ విషయానికొస్తే.. CMF ఫోన్ (1) 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ కెమెరాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. ఇది ఒకే వెనుక కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే Mediatek డైమెన్సిటీ 5G చిప్‌సెట్‌తో రావచ్చని తెలుస్తోంది.

సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఫోన్ నథింగ్ OSలో రన్ కావచ్చు. అదనంగా, ఇది 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని టాక్ నడుస్తుంది. మొత్తంమీద లీక్ అయిన ఈ సమాచారం ఫోన్ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది బడ్జెట్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది.

ఇకపోతే స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇటీవలే నథింగ్ ఫోన్ 2a ను భారతీయ మార్కెట్లో అధికారికంగా రిలీజ్ చేసింది. ఇది MediaTek Dimensity 7200 Pro SoC, ఆకట్టుకునే AMOLED డిస్‌ప్లే, సామర్థ్యం గల కెమెరాలను కలిగి ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం కూడా సూపర్‌గా ఉంది. భారతదేశంలో నథింగ్ ఫోన్ 2a మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.27,999 నుండి ప్రారంభమవుతుంది. వీటిపై క్రేజీ ఆపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

Big Stories

Advertisement
×