Big Stories

POCO F6 : 5000mAh బ్యాటరీతో పోకో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు.. లాంచ్ ఎప్పుడంటే?

POCO F6 : ప్రస్తుతానికి మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల రాజ్యం నడుస్తోంది. రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. మొబైల్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోకో కొత్త బ్రాండ్‌లను పరిచయం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్‌లు Poco F6, Poco F6 Pro ఫోన్లను తీసుకురానుంది. చాలా కాలంగా వీటికి సంబంధించిన లీక్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఫోన్‌కు మరో సర్టిఫికేషన్ వచ్చింది. ఇది ఫోన్ లాంచ్ చాలా దగ్గరలో ఉందని సూచిస్తుంది. ఇప్పడు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

- Advertisement -

Also Read : అదిరిపోయే డిజైన్‌తో సామ్‌సంగ్ 5G ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

- Advertisement -

Poco F6 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు సింగపూర్ సర్టిఫికేషన్ సైట్‌లో గుర్తించబడింది. MSP నివేదిక ప్రకారం ఫోన్ IMDA సర్టిఫికేషన్ పొందింది. ఈ ఫోన్‌ను అతి త్వరలో విడుదల అయే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ వేరియంట్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని మోడల్ నంబర్ 24069PC21G సింగపూర్ IMDAలో రిజిస్టర్ అయింది. గతంలో వచ్చిన సమచారం ప్రకారం ఈ ఫోన్ Redmi Turbo 3 బ్రాండెడ్ వెర్షన్. దీని ప్రకారం ఈ ఫోన్ ఫీచర్లు రెడ్‌మీ ఫోన్‌ను పోలి ఉంటాయి.

Poco F6‌లో 6.7 అంగుళాల 1.5K రిజల్యూషన్ OLED డిస్‌ప్లే ఇవ్వవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్, 2,400 nits పీక్ బ్రైట్‌నెస్‌ని ఫోన్‌లో చూడవచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనితో 16GB RAM+1TB స్టోరేజ్ వరకు పెంచుకోవచ్చు.

Also Read : పదివేల కన్నా తక్కువ ధరకే బెస్ట్ ఫోన్స్.. ఇటువంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు..!

కెమెరా గురించి చెప్పాలంటే వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాతో సెటప్ ఉంటుంది. దీనిలో ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 సెన్సార్ ఉంటుంది. రెండవది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో చూడవచ్చు. 5,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది. అతి త్వరలో కంపెనీ తన లాంచ్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ బడ్జెట్‌ ధరలో లాంచ్ కావచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News