Actors Dual role: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలు హీరోలు ఒక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక హీరో ద్విపాత్రాభినయంలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడం ట్రెండ్ అవుతుంది. ఇలా సీనియర్ హీరోలు మాత్రమే కాకుండా యంగ్ హీరోలు కూడా వారి సినిమాలలో డ్యూయల్ రోల్స్(Dual Role) చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అయితే విడుదల కాబోయే దాదాపు అన్ని సినిమాలలోనూ హీరోలు ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని తెలుస్తోంది. మరి ఏ ఏ హీరోలు ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు? ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..
బాలకృష్ణ…
బాలకృష్ణ(Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అఖండ 2(Akhanda). ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య అన్నదమ్ములుగా రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.
ప్రభాస్..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమాలో కూడా ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు అయితే ఈయన తాత, మనవడిగా కనిపించబోతున్నారని ఇదివరకే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ ద్వారా వెల్లడించారు.
అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఆయన ఏ ఏ పాత్రలలో కనిపించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఎన్టీఆర్..
ఎన్టీఆర్ (NTR)కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోయే దేవర2(Devara 2) సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని తెలుస్తోంది.
కార్తీ..
కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న కార్తి (Karthi)త్వరలోనే సర్దార్ 2 సినిమా(Sardar 2) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఇందులో కూడా కార్తీ తండ్రి కొడుకు పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) త్వరలోనే కింగ్ డం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. అయితే ఈ సినిమా తరువాత ఈయన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు.
ఇలా ఈ హీరోలు మాత్రమే కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) నటించబోతున్న సినిమాలో కూడా చిరు ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో కూడా ద్విపాత్ర అభినయంలో కనిపించబోతున్నారని సమాచారం. అలాగే దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న పెద్ది(Peddi) సినిమాలో కూడా రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా క్లారిటీ లేదు. ఇలా ఈ మూడు సినిమాలలో ఈ హీరోల డ్యూయల్ రోల్ గురించి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Also Read: ఆ మొహాలు చూడలేక చచ్చిపోతున్నాం.. ఢీ షో పై ఉప్పల్ బాలు ఫైర్