BigTV English
Advertisement

Lava Agni 4: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!

Lava Agni 4: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!

నోయిడాకు చెందిన టెక్ సంస్థ లావా మరో క్రేజీ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అగ్ని 3 5Gకి మంచి ఆదరణ దక్కిన నేపథ్యంలో అదే సిరీస్ కొనసాగింపుగా అగ్ని 4 అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 20న ఈ స్మార్ట్ ఫోన్ దేశీ మార్కెట్లో లాంచ్ కానున్న నేపథ్యంలో.. ఆవిష్కరణకు ముందే, కంపెనీ ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లను టీజ్ చేసింది.  ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్ ఫోన్ల మాదిరగా కాకుండా, అల్యూమినియం ఫ్రేమ్‌ తో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.  ఈ హ్యాండ్‌ సెట్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ రాబోతోంది. అగ్ని 4 ఫోన్ కుడి వైపున కొత్త బటన్‌ తో వస్తుంది. చూడ్డానికి ఇది ఆపిల్ కెమెరా కంట్రోల్ బటన్‌ ను పోలి ఉంది.


లావా అగ్ని 4 డిజైన్, స్పెసిఫికేషన్

ఇండియన్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా రాబోతోయే అగ్ని 4 మొబైల్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది.  హ్యాండ్‌ సెట్ డిజైన్‌ ను కూడా వెల్లడించింది. ఈ ఫోన్ ఫోటోల్లో వాల్యూమ్ కంట్రోలర్, లాక్/అన్‌లాక్ స్విచ్‌ తో కుడి వైపున కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ దిగువ కుడి వైపున కొత్త బటన్‌ ఉన్నట్లు కనిపిస్తుంది.  ఇది క్యాప్చర్ బటన్ కావచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బటన్ ఆపిల్ కెమెరా కంట్రోల్ బటన్‌ ను పోలి ఉంది. లావా అగ్ని 4 డ్యూయల్ LED ఫ్లాష్ యూనిట్‌ తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ ను కలిగి ఉంది.  అంతే కాకుండా, అగ్ని 4 కర్వ్ డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది  జీరో బ్లోట్‌ వేర్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది. లావా మొబైల్స్ అగ్ని 4 యూజర్లకు ఫ్రీ హోమ్ రీప్లేస్‌ మెంట్ సర్వీస్ ను కూడా అందిస్తోంది.

Read Also:  రూ. 5 వేల లోపు అదిరిపోయే హెడ్‌ ఫోన్స్.. వెంటనే కొనేయండి!


లావా అగ్ని 4 ధర ఎంత ఉండొచ్చు అంటే?

తాజా నివేదికల ప్రకారం లావా అగ్ని 4 మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌ సెట్‌ తో పాటు UFS 4.0 ఆన్‌ బోర్డ్ స్టోరేజ్‌ తో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. దీని ధర భారత్ లో రూ. 25,000 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.  ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300X చిప్‌ తో కూడిన లావా అగ్ని3 ప్లేస్ లోకి రానుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ లో 8GB RAM,  256GB వరకు ఆన్‌ బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది 66W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో 7,000mAh బ్యాటరీ రానుంది.

Read Also:  ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Related News

Vivo Y500 Pro: త్వరలో Vivo Y500 Pro లాంచ్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Apple iPhone 18: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో వచ్చేస్తోన్న

Moto G67 Power: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!

Free ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Mobile Battery: వంద శాతం వద్దు బ్రో.. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు!

Headphones under rs 5000: రూ. 5 వేల లోపు అదిరిపోయే హెడ్‌ ఫోన్స్.. వెంటనే కొనేయండి!

Earbuds Under Rs 1000: మంచి సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్.. రూ. 1000 లోపు క్రేజీ ఇయర్ బడ్స్!

Big Stories

×