Hardik Pandya: హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా తన ప్రియురాలిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా తన ప్రియురాలితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా మహికా శర్మ కలిసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు తనదైన ఆటతీరుతో ఎన్నో విజయాలను సాధించాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా తన పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త ప్రియురాలిని పరిచయం చేశాడు. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి తీసుకున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకుల అనంతరం కొంతమందితో రిలేషన్ పెట్టుకున్నాడని వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నట్టు అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా మాత్రం మహిక శర్మతో రిలేషన్ కొనసాగిస్తున్నాడు.
త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వీరిద్దరూ కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా, అగస్త్య పాండ్యా, మహికా శర్మ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో మహికా శర్మ, హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య పాండ్యాను తన పక్కన పెట్టుకొని ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అనంతరం వీరిద్దరూ తొందరలోనే వివాహం చేసుకుంటారని ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది. వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందో చూడాలి. అటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైలాగ్స్ ను కూడా గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్. బుల్లి రాజులాగా అగస్త్య పాండ్యా కూడా మారిపోయాడని అంటున్నారు.
మొన్న జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా హార్దిక్ పాండ్యాకు గాయం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా హార్దిక్ పాండ్యా కొద్ది రోజులపాటు సెలవులు తీసుకున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ చేయకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తనకు కాబోయే భార్యతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ హ్యాపీగా ఉన్నారు. గాయం పేరుతో హార్దిక్ పాండ్యా మోసం చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. గాయం అయితే రెస్ట్ తీసుకోవాల్సింది పోగా తన ప్రియురాలతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపైన హార్దిక్ పాండ్యా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.