Simon Harmer: పాకిస్తాన్ అంటే ఇండియాకు అసలు పడదన్న సంగతి తెలిసిందే. అలాంటి పాకిస్తాన్ దేశాన్ని మెచ్చుకునే వాళ్లపై మనోళ్లు గట్టిగానే ట్రోలింగ్ చేస్తారు. ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ జట్టుకు ( Sunrisers Eastern Cape) ఆడిన సైమన్ హార్మర్ (Simon Harmer ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ (Pakistan ) అందమైన దేశం అంటూ బాంబు పేల్చారు. క్రికెట్ లో భాగంగా తాను చాలా దేశాల్లో పర్యటించానని.. కానీ పాకిస్తాన్ లాంటి అందమైన దేశాన్ని ఎక్కడ చూడలేదని అతడు వ్యాఖ్యానించాడు. ఉగ్రవాదుల భయం ఉందని చాలామంది అంటున్నారు.. కానీ తనకు అలాంటిది ఏమీ కనిపించలేదని సైమన్ హార్మర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ముఖ్యంగా ఇస్తామాబాద్ లో చాలా అద్భుతమైన పర్వతాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు.
పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ లో దక్షిణాఫ్రికా టీం పర్యటించింది. ఈ జట్టులో సైమన్ హార్మర్ (Simon Harmer ) కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత, ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైమన్ హార్మర్ మాట్లాడారు. పాకిస్తాన్ ఓ అందమైన దేశం అంటూ తెగ పొగిడారు దక్షిణాఫ్రికా ప్లేయర్ సైమన్ హార్మర్ (Simon Harmer ). ఉగ్రవాదుల కంటే, పాకిస్థాన్ లో అద్భుతమైన పర్వతాలు ఉన్నాయని తెలిపాడు.
ఈ పర్వతాలను సరిగ్గా చూడలేదు, మాకు సమయం దొరికి ఉంటే, కచ్చితంగా చూసేవాళ్లమన్నాడు. పాకిస్థాన్ గడ్డపై మాకు మంచి ఆతిథ్యం లభించిందని పేర్కొన్నాడు. పాకిస్థానంలో మాకు మంచి అనుభవాలు ఉన్నాయన్నారు. అయితే, సైమన్ హార్మర్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్స్ ఫైర్ అవుతున్నారు. సైమన్ హార్మర్ లాంటి వాళ్లను ఇండియాకు రాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శత్రు దేశం పాక్ ను మెచ్చుకున్నవాళ్లను దగ్గరకు రాకుండా చేయాలని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు సైమన్ హార్మర్ మంచి స్పిన్నర్ అన్న సంగతి తెలిసిందే. ఇతడు సన్రైజర్స్ ఈస్ట్రన్ కేఫ్ జట్టుకు ఆడేవాడు. అంటే ఈ జట్టును కొనుగోలు చేసింది కావ్య మారన్. అంటే మన ఇండియా డబ్బులతో బతుకుతున్న సైమన్ హార్మర్.. ఇప్పుడు పాకిస్తాన్ ను మెచ్చుకుంటున్నాడని జనాలు ఫైర్ అవుతున్నారు. ఇలా పాకిస్తాన్ దేశాన్ని మెచ్చుకునే ఆటగాళ్లకు డబ్బులు ఇవ్వడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు డేవిడ్ వార్నర్ లాంటి వాళ్లను ఇండియాలో ఎంకరేజ్ చేయకూడదని కూడా చురకలు అంటిస్తున్నారు. గతంలో ఇండియా డబ్బులతో ఆడిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా చాలా మంది క్రికెటర్లు మన డబ్బుతో ఎదిగి, పాకిస్థాన్లో జోకుతున్నారని ఫైర్ అవుతున్నారు టీమిండి అభిమానులు.
Simon Harmer said, "Pakistan is a beautiful country, especially here in Islamabad with its stunning mountains. Unfortunately, we haven’t been able to see much of that side, but we’ve loved the warm welcome we received. It’s been a really good first experience in Pakistan." 🇵🇰❤️ pic.twitter.com/5QHTdox2kc
— Sheri. (@CallMeSheri1_) October 23, 2025