BigTV English

IRCTC: టికెట్ బుకింగ్ లో నో ఫుడ్ ఆప్షన్ తీసేశారా? కచ్చితంగా ఫుడ్ బుక్ చేసుకోవాలా?

IRCTC: టికెట్ బుకింగ్ లో నో ఫుడ్ ఆప్షన్ తీసేశారా? కచ్చితంగా ఫుడ్ బుక్ చేసుకోవాలా?
Advertisement

IRCTC No Food Option:

భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. ఆహ్లాదకరమైన ప్రయాణా అనుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రయాణ సమయంలో ఆహారాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ కావాలా? వద్దా? అనే అవకాశం కల్పించేది. నాన్ వెజ్, వెజ్.. ఏది నచ్చిన వారు దాన్ని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వద్దు అనుకుంటనే నో ఫుడ్ ఆఫ్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, గత కొద్ది రోజులుగా టికెట్ బుకింగ్ సమయంలో నో ఫుడ్ ఆప్షన్ కనిపించడం లేదంటున్నారు నెటిజన్లు. రైల్వే బలవంతంగా ప్రయాణీకులు ఫుడ్ కొనుగోలు చేసేలా చేస్తున్నాయని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఈ ఆరోపణలో నిజం ఎంత? నో ఫుడ్ ఆప్షన్ ఉందా? లేదా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఇంతకీ భారతీయ రైల్వే నో ఫుడ్ ఆప్షన్ ను తీసేసిందా?  

తాజాగా నో ఫుడ్ ఆప్షన్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. రైల్వే కావాలనే ఇలా చేసిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. అయితే, తాజాగా ఈ అంశానికి సంబంధించి థెల్లాంటాప్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో IRCTC వెబ్‌ సైట్, యాప్‌ లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు నో ఫుడ్ ఆప్షన్ అందుబాటులో లేదని చాలా మంది అంటున్నారని వివరించింది. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత అనేది ఇందులో వెల్లడించే ప్రయత్నం చేసింది. నో ఫుడ్ ఆప్షన్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉందని చెప్పుకొచ్చింది. అయితే, గతంలో ఉన్నస్థానంలో కాకుండా వేరే చోటుకు ఈ ఆప్షన్ మార్చినట్లు తెలిపింది. అందుకే ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నట్లు వివరించింది. రైల్వే ఇంటర్‌ ఫేస్‌ లో మార్పులు చేయడం వల్ల ఈ ఆప్షన్ మరో చోటుకు వెళ్లిపోయిందని, ఈ కారణంగా చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

నో ఫుడ్ ఆప్షన్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే?

నో ఫుడ్ ఆప్షన్ ఇప్పుడు వెబ్‌ సైట్‌ లో  దిగువ ప్రాంతంలో ఉన్నట్లు థెల్లాంటాప్ వివరించింది. ‘అదర్ ప్రిపరెన్సెన్స్’ విభాగంలో ‘ఐ డోంట్ వాట్ ఫుడ్/ బేవరేజెస్’ అనే ఆప్షన్ ను అందిస్తున్నట్లు తెలిపింది. యాప్ లోనూ ఆ ఆప్షన్ కనిపిస్తున్నట్లు వివరించింది. ఇకపై ఫుడ్ వద్దు అనుకున్నవాళ్లు ఈ ఆప్షన్ ను క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపింది. టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణీకులు కాస్త అలర్ట్ గా ఉండాలని సూచించింది. లేదంటే టికెట్ తో పాటు ఫుడ్ కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. సో, ఇండియన్ రైల్వే నో ఫుడ్ ఆఫ్షన్ ను తీసి వేయలేదని, కాస్త మార్పు చేసిందనే విషయాన్ని గమనించాలని సూచించింది.


Read Also: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

IRCTC Special Trip: రామేశ్వరం TO తిరుపతి, దక్షిణ దర్శనం పేరుతో IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ!

Flight Ticket: జస్ట్ రూపాయికే విమాన టికెట్, ఇండిగో అదిరిపోయే ఆఫర్!

Blast on Railway Track: ట్రాక్ పై బాంబు పేలుడు, రైల్వే సర్వీసులు బంద్!

IRCTC Tickets: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Watch Video: రైల్వే ట్రాక్ మీద రీల్స్.. దూసుకొచ్చిన రైలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు!

Viral Video: వద్దని చెప్పినా వినకుండా.. 9 నెలల పాపతో మంచు పర్వతమెక్కిన జంట, చివరికి..

Zip-lining In Hyderabad: హైదరాబాద్ లో అడ్వెంచర్ స్పాట్.. జిప్ లైనింగ్, స్కై సైక్లింగ్ ఎంజాయ్ చేయండి!

Big Stories

×