Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఎమర్జెన్సీ డోర్ నుంచి 20 నుంచి 25 మంది వరకు బయటపడినట్లు, 20 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బైక్‌పై వెళ్తున్నవారు కూడా మరణించారు. సమాచారం పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కాగా కర్నూలు బస్సు యాక్సిడెంట్‌పై ప్రధానీ మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం నాకు చాలా బాధ కలిగించింది అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు రూ.2 లక్షల, గాయపడిన వారికి రూ.50000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదంలో.. అనేక మంది అమాయకులు మరణించడం చాలా బాధాకరం. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులందరి కుటుంబాలకు.. నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి పునరావృత ప్రమాదాలు మన ప్రజా రవాణా వ్యవస్థల భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రయాణీకుల భద్రత అత్యంత ప్రాధాన్యత, వాహన నిర్వహణ బాధ్యతతో పాటు ఈ ప్రమాదాలకు జవాబుదారీతనం నిర్ధారించడం చాలా అవసరం.
Also Read: అరుపులు.. ఏడుపులు ప్రమాదం ఎలా జరిగిందో.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి