E-Paper
Advertisement

13 ఏళ్ల తర్వాత వచ్చిన GTA 6 ఎలా ఉంది? ఇదిగో ఫుల్ రివ్యూ!

13 ఏళ్ల తర్వాత వచ్చిన GTA 6 ఎలా ఉంది? ఇదిగో ఫుల్ రివ్యూ!
Advertisement

13 ఏళ్ల ఎదురుచూపులు.. కోట్లాది మంది అభిమానులు.. గేమ్ కోసం సెలవులు ప్రకటించే స్థాయికి చేరిన క్రేజ్! ఇవన్నీ చూస్తుంటే GTA 6 అనేది కేవలం వీడియో గేమ్ కాదు.. గేమింగ్ ప్రపంచంలో ఒక సంచలనం. ఒకప్పుడు సినిమాల రిలీజ్ కోసం ఇంత హడావుడి కనిపించేది.. ఇప్పుడు ఒక వీడియో గేమ్ కూడా అదే స్థాయిలో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటోంది.  అసలు ఈ గేమ్‌లో అంత స్పెషాలిటీ ఏముంది? ప్రపంచవ్యాప్తంగా ఇంతటి క్రేజ్ ఎందుకు? 13 ఏళ్ల తర్వాత వచ్చిన GTA 6 గురించి తెలుసుకుందాం.

GTA అంటే?

GTA అంటే Grand Theft Auto. రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన ఓపెన్ వరల్డ్ యాక్షన్ వీడియో గేమ్ సిరీస్. అంటే ఇందులో ప్లేయర్స్ ఒక క్యారెక్టర్‌గా గేమ్ ప్రపంచంలోకి వెళ్లి.. కార్లు నడపడం, మిషన్లు పూర్తి చేయడం, పోలీసుల నుంచి తప్పించుకోవడం, దోపిడీలు చేయడం, కొత్త ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేయడం లాంటివి చేయొచ్చు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. గేమ్‌లో మనం ఒక కథను మాత్రమే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్టు ఆ ప్రపంచంలో తిరిగే స్వేచ్ఛ ఉంటుంది.

13 ఏళ్లు తర్వాత మళ్లీ..

Advertisement

13 ఏళ్ల నిరీక్షణ ఎందుకు అంటే  2013 సెప్టెంబర్‌లో GTA 5 విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత GTA Online ద్వారా కూడా గేమ్ క్రేజ్ కొనసాగింది. కానీ GTA 5 తర్వాత కొత్త వెర్షన్ కోసం అభిమానులు ఏకంగా 13 ఏళ్లకు పైగా ఎదురుచూశారు. ఈ మధ్యలో GTA 6కు సంబంధించిన చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యేది. ట్రైలర్లు విడుదలైతే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు నవంబర్ 19, 2026న ఆ నిరీక్షణకు తెరపడింది. GTA 6 అధికారికంగా విడుదలైంది.

ఒక్కో దేశంలో.. ఒక్కో టైమ్‌లో.. మరి ఇండియాలో?

GTA 6 విడుదలలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. Rockstar Games ఈసారి అన్ని దేశాల్లో ఒకేసారి గేమ్‌ను అన్‌లాక్ చేయలేదు. ఆయా దేశాల స్థానిక సమయం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు అందుబాటులోకి వచ్చేలా విడుదల షెడ్యూల్ చేసింది. దీంతో న్యూజిలాండ్‌లో నవంబర్ 19 అర్ధరాత్రి 12 గంటలకే గేమ్ మొదట అన్‌లాక్ అయింది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 18 సాయంత్రం 4:30 గంటలకే అక్కడి గేమర్స్ ఆడటం ప్రారంభించారు. భారత్‌లో మాత్రం నవంబర్ 19 అర్ధరాత్రి 12 గంటలకు గేమ్ అందుబాటులోకి వచ్చింది. అంటే న్యూజిలాండ్‌లో ముందుగా మొదలైన గేమింగ్ హంగామా.. ఆ తర్వాత ఒక్కో టైమ్‌జోన్‌కు విస్తరించింది.

వీడియో గేమ్ ఆడుకోడానికి.. సెలవులిచ్చిన కంపెనీలు

Advertisement

ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. GTA 6 క్రేజ్ ఆఫీసుల వరకు చేరింది. సాధారణంగా ఉద్యోగులు పండుగలకు, వ్యక్తిగత పనులకు సెలవులు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక వీడియో గేమ్ కోసం కంపెనీలే సెలవులు ప్రకటించాయి. ముందుగా Logitech విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,300 మంది ఉద్యోగుల కోసం ‘Logi Game Day’ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు తమకు నచ్చిన వీడియో గేమ్ ఆడేందుకు ఒక పెయిడ్ డే ఆఫ్ తీసుకోవచ్చు. GTA 6 కోసం మాత్రమే కాకుండా ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు. ఇక ఇండియా లోని చెన్నైకి చెందిన INDE by ChairsCarte అనే ఇంటీరియర్ డిజైన్ సంస్థ కూడా నవంబర్ 19న ఉద్యోగులు, ఇంటర్న్స్, ఫ్రీలాన్సర్లకు కంపెనీ మొత్తం సెలవు ప్రకటించింది.

అమెరికాలోని జార్జియాలో ఉన్న 3rd Infantry Division కూడా GTA 6 రిలీజ్ సమయంలో రీ-ఎన్‌లిస్ట్‌మెంట్ ఒప్పందం చేసుకున్న సైనికులకు నాలుగు రోజుల పాస్ ప్రకటించింది. ఒక వీడియో గేమ్ కోసం కంపెనీలు, సంస్థలు ఈ స్థాయిలో స్పందించడం చూస్తే.. GTA 6 క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిగో రివ్యూ.. గేమ్ ఇలా ఉండబోతుంది

GTA 6లో కొత్తగా ఏం ఉండబోతోంది అనేగా మీ డోట్ ఈసారి గేమ్ స్టోరీ ఆధునిక Vice Cityలో సాగుతుంది. ఇది అమెరికాలోని ఫ్లోరిడా స్ఫూర్తితో రూపొందించిన కల్పిత Leonida రాష్ట్రంలో ఉంటుంది. ఈ గేమ్‌లో ఇద్దరు ప్రధాన పాత్రలు ఉంటారు. ఒకరు Jason Duval.. మరొకరు Lucia Caminos. jason చిన్నప్పటి నుంచి నేర ప్రపంచానికి దగ్గరగా పెరిగిన వ్యక్తి. ఆర్మీలో కొంతకాలం పనిచేసిన తర్వాత మళ్లీ డ్రగ్ రన్నర్లతో కలిసి పనిచేస్తుంటాడు. ఇక Lucia విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి పోరాడటం నేర్పించాడు.

Also Read: ఒక్క చోటే అంత బంగారమా? ఏకంగా ఏడు లక్షల కోట్లు.. లక్ అంటే వాళ్లదే!

కుటుంబం కోసం పోరాడిన ఆమె జైలుకు వెళ్లి.. అక్కడి నుంచి బయటకు వస్తుంది. తన జీవితాన్ని మార్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అయితే వీళ్లిద్దరూ కలిసి చేసే ఒక చిన్న దోపిడీ ప్రయత్నం అనుకోని పరిణామాలకు దారితీస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన క్రిమినల్ కుట్రలో చిక్కుకుంటారు. అక్కడి నుంచి బయటపడాలంటే ఒకరిపై ఒకరు ఆధారపడాల్సి వస్తుంది. ఈసారి గేమ్ ప్రపంచాన్ని మరింత వివరంగా రూపొందించారు. తప్పకుండా మీకు నచ్చుతుంది.

Tags

Related News

జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? 300GB డేటా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్.. లిస్ట్ చాలా పెద్దదే బాస్!

చలి వణికిస్తోందా?రూ.1,499కే దొరికే ఈ రూమ్ హీటర్‌తో ఇల్లు వెచ్చగా మార్చుకోండి

రూ.17,490కే బ్రాండెడ్ డిష్‌వాషర్..ఇక మీ కిచెన్ కష్టాలకు ఫుల్ స్టాప్

ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై మెటా కొరడా.. అల్గారిథమ్‌లో భారీ మార్పులు!

సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం SIM Swap.. ఓటీపీ చెప్పకపోయినా మీ అకౌంట్ జీరో అవుతుంది! జాగ్రత్త పడండిలా..

రూ.15 వేలలోపే ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేసే 4 బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

Big Stories

Advertisement
×