E-Paper
Advertisement

చలి వణికిస్తోందా?రూ.1,499కే దొరికే ఈ రూమ్ హీటర్‌తో ఇల్లు వెచ్చగా మార్చుకోండి

చలి వణికిస్తోందా?రూ.1,499కే దొరికే ఈ రూమ్ హీటర్‌తో ఇల్లు వెచ్చగా మార్చుకోండి
Advertisement

Orient Areva room heater: చలికాలం వచ్చిందంటే చాలు, రోజంతా దుప్పటి ముసుగు తన్ని నిద్రపోవాలనిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సీజన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు ల్యాప్‌టాప్ ముందు కూర్చుని టైప్ చేయాలన్నా, స్టూడెంట్స్ చదువుకోవాలన్నా చేతులు చల్లబడి ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడూ లేని విధంగా వాతావరణంలో మార్పులు వస్తున్న ఈ రోజుల్లో, చిన్నపాటి రూమ్ హీటర్ ఉండటం ఇప్పుడు చాలా మందికి చాలా అవసరం. పెద్ద బడ్జెట్ ఖర్చు చేయకుండానే, సింపుల్‌గా, సేఫ్‌గా పనిచే సే హీటర్ కోసం చూసేవారికి ఈ మోడల్ ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

పూర్తి ఫీచర్లు:

ఈ మోడల్ 2000W పవర్‌తో వస్తుంది కాబట్టి, చిన్న నుంచి మీడియం సైజు రూమ్‌లను త్వరగా వెచ్చగా చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇందులో.. రెండు హీటింగ్ మోడ్స్ ఉండటం వల్ల బయట చలి తీవ్రతకు తగ్గట్టు హీట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. చలి మరీ ఎక్కువగా లేక పోతే తక్కువ పవర్ మోడ్ వాడుకోవచ్చు. బాగా చలిగా ఉన్నప్పుడు ఫుల్ 2000W మోడ్‌పై పెడితే…. వేడి గాలి వేగంగా రూమ్‌లో వ్యాపిస్తుంది. డైలీ రొటీన్‌లో మన మూడ్‌కు,రూమ్ ఉష్ణోగ్రతకు తగ్గట్టు సెట్టింగ్ మార్చుకునే వీలు ఉండటం వల్ల కంఫర్ట్ లెవెల్ బాగుంటుంది.

Advertisement

దీని డిజైన్ విషయానికి వస్తే.. వైట్ కలర్‌లో నీట్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. కాంపాక్ట్ సైజు, పోర్టబుల్ బాడీ వల్ల రూమ్‌లో ఎక్కడైనా ఈజీగా పెట్టుకోవచ్చు, వింటర్ సీజన్ అయిపోయాక పక్కన పెట్టడానికి కూడా పెద్దగా జాగా పట్టదు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటంటే.. దీన్ని హారిజాంటల్ (అడ్డంగా), వర్టికల్ (నిలువుగా) రెండు విధాలుగానూ మౌంట్ లేదా ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్లోర్ దగ్గర లేదా టేబుల్ దగ్గర మీ సౌకర్యానికి తగ్గట్టు డైరెక్షన్ మార్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. హాస్టల్ రూమ్స్, స్టడీ టేబుల్స్, బెడ్‌రూమ్స్ వంటి చోట్ల ఇది ఇట్టే సెట్ అయిపోతుంది.

రూమ్ హీటర్ వాడేటప్పుడు.. సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ముఖ్యంగా.. ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నప్పుడు జాగ్రత్త తప్పనిసరి. ఈ హీటర్‌లో అడ్వాన్స్‌డ్ ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది.దీని వల్ల హీటర్ ఎక్కువగా వేడెక్కితే ఆటోమేటిక్‌గా కట్-ఆఫ్ అయ్యేలా తయారు చేసారు కాబట్టి, ఓవర్‌హీటింగ్ రిస్క్ తగ్గుతుంది. అలాగే ఓరియంట్ ఎలక్ట్రిక్ తరఫున 1 ఇయర్ రీప్లేస్‌మెంట్ వారంటీ లభిస్తుంది. ఇది బడ్జెట్ గాడ్జెట్ కొనేవారికి కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది.

Advertisement

Also Read: రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ధర పరంగా చూస్తే రూ.1,499 అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్, ఆఫర్లను బట్టి ధరల్లో చిన్న తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే.. కొనే ముందు ప్రాక్టికల్ అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. చాలా పెద్ద గదులు లేదా హాల్స్ మొత్తం ఒకే సారి వెచ్చగా చేయాలంటే మాత్రం ఈ పోర్టబుల్ రూమ్ హీటర్ సరి పోక పోవచ్చు, ఇది స్మాల్ లేదా మీడియం రూమ్ హీటింగ్‌కే బెస్ట్. అలాగే ..2000W హీటర్ కాబట్టి సరైన ప్లగ్ పాయింట్, మంచి వైరింగ్ ఉన్న సాకెట్ వాడటం  మంచిది. హీటర్ ఆన్‌లో.. ఉన్నప్పుడు కర్టెన్లు, బెడ్‌షీట్లు లేదా ఇతర వస్తువులు దగ్గరగా లేకుండా చూసుకోవాలి.

ఇప్పుడున్న ట్రెండ్‌లో.. స్మార్ట్‌గా, సేఫ్‌గా, బడ్జెట్‌కు తగ్గట్టు ఉండే ..ప్రొడక్ట్స్‌కే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. తక్కువ ఖర్చులో.. చలి నుంచి రిలీఫ్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్‌లా నిలుస్తుంది. పోర్టబులిటీ, రెండు హీటింగ్ మోడ్స్, అడ్వాన్స్‌డ్ ఓవర్‌హీట్ ప్రొటెక్షన్, 1 ఇయర్ రీప్లేస్‌మెంట్ వారంటీ కలిసి దీన్ని వింటర్ సీజన్‌కు యూజ్‌ఫుల్ గాడ్జెట్‌గా మార్చుతాయి.

Related News

రూ.17,490కే బ్రాండెడ్ డిష్‌వాషర్..ఇక మీ కిచెన్ కష్టాలకు ఫుల్ స్టాప్

ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై మెటా కొరడా.. అల్గారిథమ్‌లో భారీ మార్పులు!

సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం SIM Swap.. ఓటీపీ చెప్పకపోయినా మీ అకౌంట్ జీరో అవుతుంది! జాగ్రత్త పడండిలా..

రూ.15 వేలలోపే ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేసే 4 బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

బర్త్ డే విషెస్ కోసం రాత్రి 12 గంటలకు నిద్రలేవాల్సిన పనే లేదు..వాట్సాప్ మెసేజ్‌ షెడ్యూల్ చేయండిలా!

రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

Big Stories

Advertisement
×