BigTV English

HanuMan: రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘హనుమాన్’.. ఇది ఎవరూ ఊహించి ఉండరు

HanuMan: రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘హనుమాన్’.. ఇది ఎవరూ ఊహించి ఉండరు
HanuMan movie collections

HanuMan collections (cinema news in telugu):


ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని ఘన విజయాన్ని అందుకున్న లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ నటుడు తేజా సజ్జ హీరోగా నటించి మెప్పించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని కైవసం చేసుకుని.. కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ పేరు ఓ రేంజ్‌లో మారుమోగిపోయింది. ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తుంది. సౌత్‌లోనే కాకుండా అటు నార్త్‌లో కూడా ఇంకా రన్ అవుతూనే ఉంది.


సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల అవడంతో థియేటర్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎన్నో కష్టాలను ఓర్చుకుని బాక్సాఫీసు దగ్గర పొంగల్ విన్నర్‌గా నిలిచింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి చిత్రాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హనుమాన్ మూవీ తనకంటూ ప్రత్యేక రికార్డును నెలకొల్పింది.

ఈ మూవీ ఘన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల సీక్వెల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ మూవీకి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశాడు. ఇందులో శ్రీరాముడు, ఆంజనేయుడి పాత్రలు ప్రధానంగా ఉండనున్నాయని అన్నాడు. అయితే ఈ పాత్రలలో స్టార్ హీరోలు నటిస్తారని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపాడు. రాముడి పాత్రలో మహేశ్ బాబు, ఆంజనేయుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తే చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు.

ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ మూవీ దుమ్ము దులిపేస్తుంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక విడుదలైన తర్వాత కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా అమెరికా బాక్సాఫీసు దగ్గర రూ.5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది.

సంక్రాంతి పోటీలో ఎన్ని పెద్ద హీరోల సినిమాలు ఉన్నా.. వెనక్కి తగ్గకుండా ఆ సినిమాలతో పోటీని తట్టుకొని నిలబడింది. అంతేకాదు.. ఆ సినిమాలను ‘హనుమాన్’ వెనక్కి నెట్టేసింది. ఇక ఫస్ట్ డే నుంచే పాజిటివ్ తెచ్చుకున్న ఈ మూవీ దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన హనుమాన్.. ఇప్పుడు మరో ఫీట్‌ను అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల షేర్ (రూ.300 కోట్ల గ్రాస్) వసూళ్లను కొల్లగొట్టినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో హనుమాన్ ఈ ఫీట్ అందుకోవడంతో ఇటు అభిమానులు అటు మూవీ యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×