OnePlus 12R : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ (Oneplus).. త్వరలోనే వన్ ప్లస్ 13 (Oneplus 13) మొబైల్ ను ఇండియాలో లాంఛ్ చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు లాంఛ్ చేసిన వన్ ప్లస్ 12 మొబైల్ ధరలు విపరీతంగా పడిపోయాయి. ఇప్పటికే ఈ మొబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ భారీ తగ్గింపును అందిస్తున్న నేపథ్యంలో తాజాగా ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ ను అందిస్తుంది.
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్.. ఇప్పటికే వన్ ప్లస్ 13 మొబైల్ ను ఆ దేశంలో లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఇండియాలో సైతం ఈ మొబైల్ లాంఛ్ కు సిద్ధమవుతుంది. ఇక లేటెస్ట్ ఫీచర్స్, అదిరిపోయే అప్డేట్స్ తో ఈ కొత్త మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో వన్ ప్లస్ 12 మొబైల్ పై భారీ తగ్గింపును ప్రకటించింది ఫ్లిప్కార్ట్. 16GB టాప్ వేరియంట్ తో పాటు 8GB బేస్ వేరియంట్ సైతం అందుబాటు ధరలోనే లభిస్తుంది. ఇక ఈ మొబైల్ ఆఫర్స్ పై ఓ లుక్కు వేసేయండి.
OnePlus 12 అనేది OnePlus నుంచి వచ్చేసిన అత్యంత శక్తివంతమైన 2024 ఫోన్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, టాప్ టైర్ Android ఫ్లాగ్‌షిప్‌గా నడుస్తుంది. హై డిస్‌ప్లే, హై ఎండ్ కెమెరా సిస్టమ్, పెద్ద బ్యాటరీ సదుపాయం సైతం ఉన్నాయి.
OnePlus 12R (16GB వేరియంట్) అసలు ధర రూ. 45,999. అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో OnePlus 12 రూ. 53,498కి కొనుగోలు చేయవచ్చు. కాగా ఇది 16GB ప్రారంభ ధర. అంటే ఈ మెుబైల్ దాని అసలు ధరపై ఫ్లాట్ 13% తగ్గింపుతో ఉన్నట్టే. దీని వలన ధర రూ. 6,000 తగ్గుతుంది. దానితో పాటు ధరను మరింత తగ్గించడానికి కొన్ని బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అయితే ఈ కొనుగోలుపై రూ. 3,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతో ధర రూ.36,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఆఫర్ లో OnePlus 12Rను ఇప్పుడే కొనుగోలు చేస్తే దానిపై రూ. 9,000 తగ్గింపు లభిస్తుంది. ఇప్పటివరకు ఈ మొబైల్ పై బెస్ట్ తగినంత ఇదే అని చెప్పవచ్చు.
ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ ను సైతం వన్ ప్లస్ అందిస్తుంది. దీంతో ఈ మొబైల్ ను ఇంకా తక్కువ ధరకే కొనే అవకాశం ఉంటుంది. 12 నెలల పాటు HDFC బ్యాంక్ పిక్సెల్ క్రెడిట్ కార్డ్ EMIపై రూ. 1500 వరకు 12% తగ్గింపు లభిస్తుంది.
OnePlus 12R స్పెసిఫికేషన్స్ –
OnePlus 12R మెుబైల్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది. ఇక 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంది. ఇక గరిష్ట బ్రైట్నెస్ 4500 నిట్స్, Snapdragon 8 Gen 2 చిప్‌సెట్, OxygenOS 15 ఉన్నాయి. కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే.. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.