BigTV English

Suriya: భారీ బడ్జెట్ సినిమా నుండి తప్పుకున్న సూర్య.. ‘కంగువా’ ఎఫెక్టేనా.?

Suriya: భారీ బడ్జెట్ సినిమా నుండి తప్పుకున్న సూర్య.. ‘కంగువా’ ఎఫెక్టేనా.?

Suriya: సినిమా కథను రాసుకున్నప్పటి నుండి ఆ సినిమాను తెరపై చూసేవరకు అది పూర్తవుతుందని, ప్రేక్షకుల ముందుకు వస్తుందని గ్యారెంటీ లేదు. అలా ఎన్నో సినిమాలు సగం షూటింగ్ పూర్తయిన తర్వాత, మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆగిపోయినవి ఉన్నాయి. అలాంటి ఖాతాలో ఇప్పుడు ఒక సూర్య సినిమా కూడా చేరింది. శివ దర్శకత్వంలో వచ్చిన ‘కంగువా’ (Kanguva) సినిమాతో అతిపెద్ద హిట్‌ను తమ ఖాతాలో వేసుకుందామని అనుకున్నాడు సూర్య. కానీ అలా జరగలేదు. దీంతో సూర్య ఆలోచనలో పడ్డాడని తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నో అంచనాల మధ్య మొదలయిన మరొక మూవీ కూడా షెడ్‌కు వెళ్లిందని తెలుస్తోంది. దాని వెనుక అసలు కారణమేంటి అని తాజాగా బయటపడింది.


అధికారికంగా ప్రకటన

‘కంగువా’ కంటే ముందు బాలా దర్శకత్వంలో ‘వనంగాన్’ అనే మూవీని ఓకే చేశాడు సూర్య (Suriya). దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. పోస్టర్లు విడుదలయ్యాయి. క్యాస్టింగ్ ఫిక్స్ అయ్యింది. షూటింగ్ మొదలయ్యింది. ఆఖరికి 2025 జనవరి 10న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఇంతలోనే ‘కంగువా’లో సూర్య బిజీ అయ్యాడు. ‘వనంగాన్’కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా లేదు. అసలు దీనికి ఏమైంది? దీని గురించి ఎలాంటి అప్డేట్ ఎందుకు లేదు? అని సూర్య ఫ్యాన్స్‌లో సందేహం మొదలయ్యింది. ఇంతలోనే ‘వనంగాన్’ మూవీ ఇక లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దానికి కారణాలు కూడా బయటపెట్టారు.


Also Read: అలా చేసినందుకు ఒక ముసలావిడ నన్ను కొట్టింది.. ‘96’ డైరెక్టర్ కామెంట్స్

అదే కారణం

‘వనంగాన్’ (Vanangaan) ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అసలైన కారణాన్ని దర్శకుడు బాలానే స్వయంగా చెప్పుకొచ్చాడు. ‘‘ఈ సినిమా ఎక్కువశాతం రియల్ లొకేషన్స్‌లో, టూరిస్ట్ ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. దానివల్ల ఎక్కువమంది జనాలు చేరి చూడడంతో పాటు పలు సమస్యలు కూడా వచ్చాయి’’ అని బాలా తెలిపాడు. దానివల్లే సూర్య, బాలా కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ఆపేయాలని మ్యూచువల్‌గా ఒప్పుకున్నారట. భవిష్యత్తులో మళ్లీ కలిసి పనిచస్తామని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. ‘వనంగాన్’ వల్ల విభేదాలు వచ్చినా పర్సనల్‌గా తనకు, సూర్యకు ఎలాంటి మనస్పర్థలు లేవని ఈ దర్శకుడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా లేదనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది.

అన్నీ ఫిక్స్

‘వనంగాన్’ సినిమాలో సూర్యకు జోడీగా రోషిని ప్రకాశ్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. సురేశ్ కామాచి దీనిని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ముందుకొచ్చారు. జీవీ ప్రకాశ్, సామ్ సీఎస్ కలిసి దీనికి సంగీతాన్ని అందించాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. అన్ని ఫిక్స్ అయ్యి షూటింగ్ కూడా ప్రారంభమయిన తర్వాత సినిమా అటకెక్కడం అనేది సూర్య ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేస్తోంది. మొత్తానికి దర్శకుడు బాలా చెప్పిన కారణంతో మూవీ ఆగిపోయిందనే విషయాన్ని కూడా వాళ్లు నమ్మలేకపోతున్నారు. శివ దర్శకత్వంలో ‘కంగువా’ తెచ్చిపెట్టిన నష్టాన్ని క్లియర్ చేయాలంటే ‘వనంగాన్’ బెస్ట్ అనుకున్న సూర్య ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్ కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×