Bison OTT: సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం సర్వసాధారణంగా జరిగే విషయం. ఇప్పటికే ఎంతోమంది హీరోల పిల్లలు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా దర్శకులుగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రముఖ హీరో విక్రమ్(Vikram) కుమారుడిగా ధ్రువ్(Dhruv) అందరికీ ఎంతో సుపరిచితమే. తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అర్జున్ రెడ్డి సినిమాని ఈయన తమిళంలో ఆదిత్య వర్మ అనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ధ్రువ్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా అయ్యారు. అయితే ఈయన తదుపరి చిత్రం మహాన్ థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల కావడంతో ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికి తెలియలేదు కానీ తాజాగా బైసన్(Bison) అనే సినిమా ద్వారా ధ్రువ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj)దర్శకత్వంలో ధ్రువ్, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఈనెల 17వ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకొని తమిళంలో విడుదల అయ్యి అక్కడ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇదే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తెలుగులో విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీగా నిర్వహించారు.
ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ధ్రువ్ ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 24వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ముందు రోజే ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమా తమిళంలో మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తెలుగులో కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ (Net flix)కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది.
వరుస హిట్లతో అనుపమ..
ఇక ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే తెలుగు తమిళ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.. ఇక ఈ సినిమా తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో తెలుగులో కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తమిళంలో హిట్ కొట్టిన ఈ హీరోకి తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ధ్రువ్ మరొక దర్శకుడు గణేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలవడాల్సి ఉంది.. ఇక అనుపమ పరమేశ్వరన్ నెల వ్యవధిలోనే ఏకంగా మూడు సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో పరదా ప్రేక్షకులను మెప్పించలేకపోయినా కిష్కిందపురి, బైసన్ సినిమాలతో హిట్ కొట్టారు.
Also Read: Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!