OTT Movie : డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ ప్రయత్నంలో అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఒక అడుగు ముందుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటీవీ విన్ ప్రతివారం కొత్త కంటెంట్తో ఆడియన్స్ ని అలరిస్తోంది. కదా సుధా వీక్లీ సిరీస్ లో భాగంగా ప్రతి ఆది వారం ఫ్యామిలీ ఆడియన్స్ ని అబ్బురపరుస్తోంది. ఫ్యామిలీ కంటెంట్ నే కాకుండా థ్రిల్లర్, కామెడీ, హారర్ జానర్లో షార్ట్ ఫిలిమ్స్ ను తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా వీటిని చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. గత ఆదివారం ఒక సరికొత్త సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ, లవ్ స్టోరీని కూడా అందిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఈ స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ‘Rider A Tale of Lost Love’. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా, ఒక ఆసక్తికరమైన కథనాన్ని అందించింది. దీనికి కిషోర్ గుణన దర్శకత్వం వహించారు. గని పిక్చర్స్ బ్యానర్ పై కొత్తపల్లి సురేష్ దీనిని నిర్మించారు. ఈ సినిమాలో రావణ రెడ్డి, మేఘన, గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించారు. అరగంట నిడివి ఉన్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది.
Read Also : 456 మంది ఆటగాళ్ళు…. 40 కోట్ల నజరానా… ఇండియాలో ‘స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఈ కథలో హీరో బైక్ రైసింగ్ లు చేస్తుంటాడు. ఫ్యామిలీతో పాటు, పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉంటాడు. అయితే ఒక రోజు ఇతని జీవితంలోకి ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఎంట్రీతో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. హీరోకి తండ్రి మీద అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. ఇక ఒక వైపు తండ్రిని, మరో వైపు అమ్మాయిని బ్యాలెన్స్ చేసే క్రమంలో ఈ స్టోరీ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటి ? ఆ అమ్మాయిని హీరో ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా ? హీరో తన ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్తాడా ? అనే విషయాలను, ఈ ఫ్యామిలీ ఎంటర్టైన సినిమాను చూసి తెలుసుకోండి.