దేశ రవాణా వ్యవస్థలో ఇండియన్ రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. దేశానికి జీవనాడిగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వే బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. అదే సమయంలో భారతీయ రైల్వే సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది. IRCTC రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే విధానాన్ని మరింత మెరుగుపరిచింది. ఇప్పుడు రైల్వే కౌంటర్ల దగ్గర పెద్ద క్యూలలో నిలబడవలసిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ లో ఈజీగా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే, భారతీయ రైల్వే ఒక రోజులో IRCTC ద్వారా ఎన్ని టిక్కెట్లు విక్రయిస్తుంది? వాటి ద్వారా ఎంత ఆదాయం సంపాదిస్తుంది? అనేది తెలుసుకుందాం.
రైల్వే మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. IRCTC ప్రతిరోజూ 1.3 నుంచి 1.4 మిలియన్ల రైలు టికెట్లను అమ్ముతుంది. అయితే, పండుగలు, సెలవులు లాంటి బిజీ ప్రయాణ సీజన్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే రెట్టింపు అవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు, IRCTC రోజుకు సగటున 1.388 మిలియన్ టిక్కెట్లను బుక్ చేసింది.
ప్రయాణికుల సంఖ్య, సరుకు రవాణాను బట్టి భారతీయ రైల్వే రోజువారీ ఆదాయం 4 బిలియన్ల నుంచి 6 బిలియన్లు.. భారత కరెన్సీలో రోజూ రూ. 400 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు సంపాదిస్తుంది. ప్రయాణీకుల టిక్కెట్ల అమ్మకాలు ఈ ఆదాయంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. IRCTC టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్‌గా కాకుండా వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది. ప్రతి ఆన్ లైన్ టికెట్ బుకింగ్ పై వసూలు చేసే సర్వీస్ ఛార్జ్ IRCTC రోజువారీ ఆదాయానికి సాయపడుతుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో ఆహారం, డ్రింక్స్ సర్వీసులు కూడా ఆదాయానికి కారణం అవుతాయి. ఇదే కాకుండా, IRCTC తీర్థయాత్రలు, భారత్ గౌరవ్ రైళ్లు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ఇతర ప్రయాణ ప్యాకేజీలను అందిస్తుంది. IRCTC వెబ్ సైట్, మొబైల్ యాప్, రైల్వే స్పేస్ ప్రకటనల కోసం ఉపయోగించబడతాయి.
Read Also: అబ్బాయి, అమ్మాయికి కలిపి RAC సీటు.. చివరికి ఏం జరిగిందంటే?
టికెట్ బుకింగ్ లు, ఆదాయాలు ఏడాది పొడవునా ఒకేలా ఉండవు. దసరా, దీపావళి, ఛత్ పూజ, హోలీ లాంటి పండుగ సమాయాల్ల, వేసవి సెలవుల సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన టిక్కెట్ల అమ్మకాలు, ఆదాయం రెండూ పెరుగుతాయి. IRCTC వెబ్ సైట్, మొబైల్ యాప్ ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగదారులు ఉపయోగిస్తారు.
Read Also: స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీ కోచ్ ప్రయాణం, రైల్వే క్రేజీ స్కీమ్ గురించి తెలుసా?