BigTV English

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓజీ’… 350 కోట్ల పవన్ కళ్యాణ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓజీ’… 350 కోట్ల పవన్ కళ్యాణ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

OTT Movie : పవన్ కల్యాణ్ నటించిన యాక్షన్ సినిమా ‘ఓజి’ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు థియేటర్లలో 300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా, సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే నెల లోపే, ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి రావడంతో అభిమానులు, మళ్ళీ చూడటానికి  ఉత్సాహం చూపిస్తున్నారు.  తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్‌తో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ పాత్రలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ముంబై అండర్‌వరల్డ్‌ ప్రధాన అంశంగా సాగే ఈ సినిమాలో, పవన్ కళ్యాణ్ యాక్షన్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను, తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ఓజి’ (They Call Him OG) 2025 సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల అయిన తెలుగు యాక్షన్ మూవీ. అక్టోబర్ 23 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఎఏ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించారు. ఇందులో పవన్ కల్యాణ్, ఎమ్రాన్ హాష్మి), ప్రియాంకా అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. 2 గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు ఐయండిబిలో 6.8/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

ముంబై అండర్‌వరల్డ్‌లో సాగే ఈ కథ 1993లో మొదలవుతుంది. ఓజి (పవన్ కల్యాణ్) అనే మాఫియా డాన్, 10 సంవత్సరాలు ముంబైకి దూరంగా ఉంటాడు. అతను గతంలో ఒక పెద్ద కుట్రలో చిక్కుకుని సిటీకి దూరంగా ఉంటాడు. అయితే ఇప్పుడు అతను తన ఎంపైర్ తిరిగి పొందాలని మళ్ళీ తిరిగి వస్తాడు. తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. OG చుట్టూ పెద్ద సైన్యమే ఉంటుంది. OG ముంబైకి వచ్చిన తర్వాత, అతను వచ్చాడన్న వార్తలు చాలా మందిలో భయం పుట్టిస్తాయి. ఇక OG ప్రతీకార యాత్ర మొదలవుతుంది. ముంబై అండర్‌వరల్డ్‌లో తన ఎంపైర్ తిరిగి పొందడానికి OG ప్లాన్ చేస్తాడు. అతని ప్రధాన శత్రువు భాను (ఎమ్రాన్ హాష్మి) ఒక క్రూరమైన మాఫియా లీడర్. గతంలో చేసిన కుట్రల వల్ల OG అతన్ని దూరం పెడతాడు.


Read Also : 300 కోట్ల దోపిడీ… బిగ్గెస్ట్ రియల్ లైఫ్ దొంగతనం… ‘మనీ హీస్ట్’లాంటి కేక పెట్టించే థ్రిల్లర్

ఇక శత్రువుల మీద OG ఒక్క సారిగా విరుచుకుపడతాడు. ఈ యాక్షన్ సీన్స్‌తో ముంబై అండర్‌వరల్డ్‌ అట్టుడికి పోతుంది. క్లైమాక్స్ లో భానుతో పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. OG తన శత్రువులను ఒడిస్తాడా ? తన ఎంపైర్ ను తిరిగి పొందుతాడా ? పది సంవత్సరాలు ఎందుకు ముంబై కి దూరంగా ఉన్నాడు ? అతని పై జరిగిన కుట్రలు ఏమిటి ? అనే ప్రశ్నలకు సామాధానాలను, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : ప్రియుడి కోసం భర్తకు తెలియకుండా పాడు పని… దిమాక్ ఖరాబ్ సీన్లు ఎన్నో

OTT Movie : అమ్మాయి మాయలో కొడుకు… ఆ బంధమే తండ్రికి అడ్డుగోడ… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా ?

OTT Movie : స్టార్ హీరోయిన్ల బోల్డ్ అటెంప్ట్… ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవైటింగ్ తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్

Bison OTT: ధ్రువ్ విక్రమ్ బైసన్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : 2 గంటల 44 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… రేటింగ్‌లో ‘కాంతారా’ కంటే టాప్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OG OTT : ఓజీ ఓటీటీలోకి అయితే వచ్చింది.. కానీ, పవన్ ఫ్యాన్స్‌నే హర్ట్ చేశారు

OTT Movie : అర్ధరాత్రి ఇద్దరమ్మాయిల అరాచకం… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే మావా

Big Stories

×