BigTV English

Rakesh Master: అందుకు జానీ కాలర్ పట్టుకున్నాను, తనలో ఆ క్వాలిటీ ఉంది.. రాకేష్ మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

Rakesh Master: అందుకు జానీ కాలర్ పట్టుకున్నాను, తనలో ఆ క్వాలిటీ ఉంది.. రాకేష్ మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

Rakesh Master About Jani Master: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ కేసు గురించే చర్చలు జరుగుతున్నాయి. ఒక గురువు స్థానంలో ఉండి తన దగ్గర పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్‌ను అలా చేయడం కరెక్ట్ కాదని, తనను ఉరితీయాలంటూ నెటిజన్లు తనపై తీవ్రంగా ఆగ్రహం చూపిస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు, తన తోటి కొరియోగ్రాఫర్లు మాత్రం జానీ అలాంటివాడు కాదు అని, తనను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ తనకు సపోర్ట్ చేస్తున్నారు. తప్పు చేశానని జానీ మాస్టర్ ఒప్పుకున్నా కూడా అది నమ్మడానికి కొందరు సిద్ధంగా లేరు. ఇదే సమయంలో జానీ మాస్టర్ గురించి ఒకప్పుడు రాకేష్ మాస్టర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.


ఎక్కడో నేర్చుకున్నాడు

సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు అంతా ఒకే ఫ్యామిలీగా కలిసుంటారు. ఎవరికి కష్టం వచ్చినా మరొకరు సాయం చేయడానికి ముందుకొస్తారు. అలాంటి డ్యాన్సర్లు అందరికీ ఒక అసోసియేషన్ ఉండాలనే ఆలోచన ముందుగా తనకే వచ్చిందని రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ‘‘జానీకి ప్రకాశ్ అనే గురువు ఉండేవాడు. జానీ ఎక్కడో డ్యాన్స్ నేర్చుకొని వచ్చినా కూడా ప్రకాశ్ మాస్టర్‌ను గురువుగా చూసేవాడు. ప్రకాశ్ నా క్లోజ్ ఫ్రెండ్. తనను డ్యాన్సర్ల యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా నిలబడమంటే ఒప్పుకోలేదు. కానీ జానీ మాస్టర్ మాత్రం ప్రెసిడెంట్‌గా పోటీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అందరం మా ఇంట్లో కలిశాం’’ అని చెప్పుకొచ్చారు రాకేష్.


Also Read: బాధేస్తుంది.. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగేది ఇదే: ఐశ్వ‌ర్య రాజేష్‌

మాటిచ్చాను

‘‘జానీ మా ఇంటికి రాగానే తనను ప్రెసిడెంట్‌గా నిలబడమని నేను సపోర్ట్ చేస్తానని అన్నాను. తను అప్పుడు చాలా సంతోషంలో ప్రకాశ్‌ను గాడు అన్నాడు. అంతే వెంటనే తన కాలర్ పట్టుకున్నాను. నీ గురువు నా ఫ్రెండ్ అని అరిచాను. ఆ తర్వాత ప్రకాశ్ కూడా ప్రెసిడెంట్‌గా పోటీచేసినా నేను జానీకి మాటిచ్చాను కాబట్టి తనకే సపోర్ట్‌గా ఉన్నాను’’ అని గుర్తుచేసుకున్నారు రాకేష్ మాస్టర్. తనను కొట్టినా కూడా జానీ అర్థం చేసుకున్నాడని అప్పటినుండి తనను బాబాయ్ అని పిలిచేవాడని అన్నారు. ఆ తర్వాత వారి మధ్య జరిగిన ఒక మధురమైన జ్ఞాపకం గురించి కూడా రాకేశ్ మాస్టర్ మాట్లాడారు.

జీవితంలో మర్చిపోలేను

‘‘రంజాన్‌కు జానీ మాస్టర్ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. దానికోసం పదివేల కుర్తా కొనిచ్చాడు. అప్పుడు చెప్పులు దొరకకపోతే తర్వాత అసిస్టెంట్‌తో ఇంటికి పంపించాడు. నా జీవితంలో జానీని మర్చిపోలేను. అలా ఈ కాలంలో ఎవరూ చేయలేరు. జానీ చాలా మంచివాడు. నాలాగే కోపం ఎక్కువ. అందరినీ ప్రేమిస్తాడు, మోసం చేస్తే బాధపడతాడు. రంజాన్ రోజు వాళ్ల ఇంటికి వెళ్తే నాకు వడ్డించాడు. అది తన గొప్పతనం. నేను తనకు డ్యాన్స్ నేర్పించలేదు. తనకు అన్నం లేని సమయంలో గుర్తించి అవకాశం ఇచ్చానని ఎప్పుడూ చెప్తుంటాడు. నాకు ఏదైనా బాధ వచ్చిదంటే జానీకి ఫోన్ చేసి, తనతోనే షేర్ చేసుకుంటాను. తనది మంచి మనసు’’ అంటూ జానీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు రాకేష్ మాస్టర్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×