BigTV English
Advertisement

OnePlus Nord CE3 5G: కీప్యాడ్ మొబైల్ ధరకే వన్‌ప్లస్.. 50 MP కెమెరా, 5,000mAh బ్యాటరీ 5జీ స్మార్ట్‌ఫోన్.. అలాంటి ఇలాంటి ఆఫర్ కాదిది!

OnePlus Nord CE3 5G: కీప్యాడ్ మొబైల్ ధరకే వన్‌ప్లస్.. 50 MP కెమెరా, 5,000mAh బ్యాటరీ 5జీ స్మార్ట్‌ఫోన్.. అలాంటి ఇలాంటి ఆఫర్ కాదిది!

OnePlus Nord CE3 5G Mobile Offers: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్ కంపెనీకి మంచి క్రేజ్ ఉంది. అతి తక్కువ సమయంలోనే ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కిర్రాక్ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో కొత్త కొత్త మోడళ్లను ఫోన్ ప్రియులకు పరిచయం చేస్తూ అందరి దృష్టిలో పడింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ నుంచి ఎలాంటి మోడల్ రిలీజ్ అవుతున్నా కొనేస్తున్నారు. మరి వాటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే అధిక ధర కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకున్న వారికి మాత్రం ఇప్పుడొక అదిరిపోయే గుడ్ న్యూస్.


వన్ ప్లస్‌ నుంచి సూపర్ క్రేజ్ అందుకున్న OnePlus Nord CE3 5G ప్రస్తుతం గొప్ప ఆఫర్లలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కారణంగా OnePlus Nord CE3 5Gని తక్కువ ధరకే కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న వినియోగదారులకు, వారి బడ్జెట్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన అవకాశం. ఈ ఫోన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాము.

OnePlus Nord CE3 5G Specifications


OnePlus Nord CE3 5G సరికొత్త Android 14 పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 9000 చిప్‌సెట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల 120 Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక OnePlus Nord CE3 5G కెమెరా నాణ్యత విషయానికొస్తే.. OnePlus Nord CE3 5G 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది.

Also Read: 8GB RAM, 50MP కెమెరా, 5500 mAh బ్యాటరీ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. డోంట్ మిస్!

సెల్ఫీ, వీడియో కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ మొబైల్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది OxygenOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే Qualcomm Snapdragon 782G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. OnePlus Nord CE3 5G బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యుఎస్‌బి టైప్-సి వంటి ఫీచర్లు ఈ ఫోన్‌కి అందించబడ్డాయి.

OnePlus Nord CE3 5G Offer price

OnePlus Nord CE3 5G మొబైల్ 8GB RAM, 128GB Storage అసలు ధర రూ.26,999గా ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.18,999లకే లిస్ట్ అయింది. అయితే ఇదే వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,575కి ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌పై అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Canara Bank Credit Card Non EMI ట్రాన్షక్షన్‌పై రూ.500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది.

ఇది కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా రూ.16,650 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు దీనిని కేవలం రూ.2,349లకే సొంతం చేసుకోవచ్చు. దీని బట్టి చూస్తే వన్‌ప్లస్ 5జీ ఫోన్‌ను కీప్యాడ్ ఫోన్‌ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఇంతపెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్, హ్యాంగింగ్ ఉండకూడదు. అలాంటప్పుడే ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు.

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×