BigTV English

IPL 2024 Closing Ceremony: అమెరికన్ రాక్ బ్యాండ్ తో.. చెపాక్ లో ముగింపు వేడుకల జోష్

IPL 2024 Closing Ceremony: అమెరికన్ రాక్ బ్యాండ్ తో.. చెపాక్ లో ముగింపు వేడుకల జోష్

International Band Imagine Dragons To Perform At IPL 2024 Closing Ceremony In Chennai: ఐపీఎల్ 2024 సీజన్ ముగింపు రోజు వచ్చేసింది. రాత్రి 7.30 కి కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో రెండు జట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధ పడుతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచి విజేతగా ప్రకటించిన తర్వాత.. ఐపీఎల్ ముగింపు వేడుకలను భారీగా చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. దేశమంతా వీటి కోసం  ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


ఈసారి ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ రానున్నారు. ఇప్పటికే వారి మ్యూజిక్ ఎక్విప్ మెంట్ అంతా విమానాల్లో చెన్నయ్ చేరుకుంది. అక్కడ వారు స్టేజ్ ఏర్పాట్లు, కలర్ ఫుల్ డిజిటల్ లైట్స్ తో ధూమ్ ధామ్ గా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్  వెల్లడించింది. బ్యాండ్ ప్రధాన గాయకుడు డాన్ రేనాల్డ్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలా యువతను షేక్ చేసింది.

మొత్తానికి ముగింపు వేడుకలు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. మ్యాచ్ రాత్రి 7.30కి ప్రారంభం అవుతుంది. మ్యాచ్ కు ముందు అమెరికన్ రాక్ బ్యాండ్ ప్రత్యేక పాటలు, ప్రదర్శనలతో అలరిస్తారు. పైనల్ మ్యాచ్ కు స్వాగతం పలుకుతారు. మ్యాచ్ అనంతరం ఘనంగా వీడ్కోలు పలుకుతారు.


Also Read: ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్, రూ. 2.07 కోట్లు

ఇప్పటివరకు కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ మధ్య 27 సార్లు పోటీ జరిగింది. కోల్ కతా రికార్డ్ స్థాయిలో 18 సార్లు గెలిచింది. హైదరాబాద్ మాత్రం చచ్చే చెడి 9 సార్లు గెలిచింది. మరి ఈసారి హైదరాబాద్ కెప్టెన్ మారాడు, టీమ్ మారింది. యువకులు, సీనియర్స్ తో కలిసి మంచి సమతూకంగా ఉంది. మరేం చేస్తారో చూడాలి.

కష్టపడి ఫైనల్ వరకు వచ్చిన టీమ్ కోల్ కతా అయితే, అక్కడక్కడ అదృష్టం తన్ని ఇంతవరకు వచ్చిన టీమ్ హైదరాబాద్ అని చెప్పాలి. మరి ఫైనల్ లో కూడా అలాంటి అదృష్టం ఏమన్నా పట్టబోతుందా చూడాలి? లేదా న్యాయంగా, ధర్మంగా కష్టపడి ఫైనల్ వరకు చేరిన కోల్ కతా గెలుస్తుందా చూడాలి.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×