BigTV English

OnePlus Open Apex: వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్ లాంచ్‌కు సిద్ధం.. ఫోన్ మాత్రం యమ స్టైల్..!

OnePlus Open Apex: వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్ లాంచ్‌కు సిద్ధం.. ఫోన్ మాత్రం యమ స్టైల్..!

OnePlus Open Apex Launching Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ OnePlus కొత్త కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open నుంచి కొత్త ఎడిషన్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అదే ‘OnePlus Open Apex’ స్మార్ట్‌ఫోన్. వన్‌ప్లస్ నుంచి రాబోతున్న ఈ కొత్త వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్ ఆగస్టు 7న భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లో రిలీజ్ కానుంది. OnePlus తన ఎంట్రీతో కొత్త కలర్‌ వేరియంట్‌ని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఎడిషన్ ర్యామ్ + స్టోరేజ్ పరంగా కూడా అప్‌గ్రేడ్‌లను పొందవచ్చని అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడింది.


OnePlus Open Apex ఎడిషన్ గతంలో షేర్ చేసిన టీజర్ ప్రకారం.. OnePlus ఓపెన్ అపెక్స్ ఎడిషన్ క్రిమ్సన్ షాడో అనే కొత్త కలర్‌వేలో వస్తుంది. ఈ కొత్త షేడ్ ప్రస్తుతం ఉన్న ఎమరాల్డ్ డస్క్, వాయేజర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో చేరుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కొత్త ఎడిషన్ గత సంవత్సరం లాంచ్ చేసిన OnePlus Open ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మెరుగైన వెర్షన్ అని భావిస్తున్నారు.

అపెక్స్ ఎడిషన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వన్‌ప్లస్ ఇంకా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ ఫోన్‌లో వన్‌ప్లస్ ఓపెన్‌‌లో ఉండే స్పెసిఫికేన్లే ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో కొన్ని అప్‌గ్రేడ్‌లు కూడా ఉండవచ్చని అంటున్నారు. అలాగే OnePlus అపెక్స్ ఎడిషన్ ధరను కూడా కంపెనీ వెల్లడించలేదు. ఏది ఏమైనప్పటికీ ఆగస్ట్ 7న అధికారిక లాంచ్ సందర్భంగా ధర, స్పెసిఫికేషన్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Also Read: వన్‌ప్లస్‌ నుంచి నెంబర్ వన్ ఫోన్ లాంచ్.. కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. అట్లుంటది మరి..!

OnePlus Open Specifications

OnePlus ఓపెన్ స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. ఇందులో 7.82-అంగుళాల 2K ఫ్లెక్సీ-ఫ్లూయిడ్ LTPO 3.0 AMOLED ప్రైమరీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 2,800 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. అలాగే వెలుపల 6.31-అంగుళాల 2K LTPO 3.0 సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను అదే రిఫ్రెష్ రేట్, ఇంటర్నల్ స్క్రీన్ వలె గరిష్ట ప్రకాశంతో వస్తుంది. పనితీరు కోసం ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 16GB RAM + 512GB స్టోరేజ్‌తో వచ్చింది.

కెమెరా విషయానికొస్తే.. OnePlus OIS, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, OmniVision OV64B సెన్సార్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ 3X టెలిఫోటో కెమెరా, 48-మెగాపిక్సెల్ సోనీ IMX581 అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఇది ప్రైమరీ డిస్‌ప్లేలో 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, కవర్ డిస్‌ప్లేలో 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇది 67W SuperVOOC ఛార్జింగ్‌కు మద్దతుతో 4,800mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Blind Man AI Glasses: ఏఐ గ్లాసెస్‌తో కంటి చూపు లేని వ్యక్తికి ఉద్యోగం.. అదెలాగంటే?

Big Stories

×