BigTV English

Drugs: ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్ లో డ్రగ్స్.. నలుగురు అరెస్ట్

Drugs: ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్ లో డ్రగ్స్.. నలుగురు అరెస్ట్

Drugs in SR Nagar Boys Hostel: హైదరాబాద్ లో డ్రగ్స్ భూతాన్ని అణచివేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. పెడ్లర్లు అంతకంతకూ చెలరేగిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ ను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా యువతే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వనస్థలిపురంలో డ్రగ్స్ పట్టివేత, రాచకొండలో డ్రగ్స్ లభ్యం వంటి వార్తలే చూశాం. కానీ ఇప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఎస్ఆర్ నగర్ లోనూ డ్రగ్స్ భూతం బయటపడింది.


ఎస్ఆర్ నగర్ లోని ఒక బాయ్స్ హాస్టల్ లో నలుగురు యువకులు డ్రగ్స్ సేవిస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ హాస్టల్ కు డ్రగ్స్ సరఫరా చేశారని తెలుసుకుని.. ఆ హాస్టల్ లో తనిఖీలు చేయగా యువకులు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు.

మరోవైపు సికింద్రాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లలిత్ అనే ఉద్యోగి ఓయో రూమ్ లో బలవన్మరణం చెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు వీడియో మెసేజ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Telugu states: తీవ్ర విషాదం.. తెలుగురాష్ట్రాల్లో పిడుగులు పడి తొమ్మిది మంది మృతి

Karimnagar Incident: పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి శవమైన తల్లి.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న చిన్నారులు

Hyderabad News: కాళ్లు కట్టేసి.. కుక్కర్‌తో కొట్టి, గొంతు కోశారు.. కూకట్‌పల్లిలో మహిళ హత్య

TamilNadu News: పరోటా కోసం వెళ్లి ప్రాణాలే పొగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..?

Hyderabad News: గణేష్ ఉత్సవాలు.. మహిళలతో అసభ్య ప్రవర్తన, మొత్తం 1612 మంది అరెస్ట్

Jogulamba Gadwal: పత్తి చేనులో పిడుగు పడి.. ముగ్గురు మృతి

Big Stories

×