BigTV English

Chennai High Court Fire On Vishal: ఇదేమైనా సినిమా షూటింగ్ హా.. హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు ఫైర్

Chennai High Court Fire On Vishal: ఇదేమైనా సినిమా షూటింగ్ హా.. హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు ఫైర్

Chennai High Court warns actor Vishal: తమిళ్ స్టార్ హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఓ కేసు విచారణలో భాగంగా హీరో విశాల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ కేసులో భాగంగా ఆయన కోర్టుకు ఇచ్చిర వివరణపై మద్రాస్ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా..సరైన సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఫైర్ అయ్యారు.


హీరో విశాల్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, విచారణలో భాగంగా తెల్ల కాగితాలపై సంతకాలు చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని జడ్జి ఎదుట విశాల్ వాదించారు. అయితే విశాల్ ఇచ్చిన వివరణపై హైకోర్టు స్పందించింది. తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదని, సరైన సమాధానం చెప్పండి అంటూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా హీరో విశాల్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మధ్య డబ్బుల విషయంలో వివాదరం కొనసాగుతోంది. అయితే అంతకుముందు విశాల్ తన ఫైనాన్సియర్ నుంచి రూ.21 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ డబ్బును లైకాలీకా సంస్థ ఆయనకు అందజేసింది. ఈ మేరకు ఒప్పందం ప్రకారం.. రుణం తీరే వరకు విశాల్ నటించిన ప్రతీ సినిమాను లైకా సంస్థకు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ విశాల్ నటించిన  ‘వీరమె వాగై చూడమ్’ సినిమా ఇతర సంస్థకు విక్రయించాడు. దీంత్ వివాదం రాజుకుంది.


Also Read: టాలీవుడ్ డైరెక్టర్ మృతి.. మంచు మనోజ్ ఎమోషనల్

హీరో విశాల్..ఒప్పందం ప్రకారం మా సంస్థకు విక్రయించాలని, ఇతర సంస్థలకు ఎలా అమ్ముతాడని లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు వాదనకు రాగా..విశాల్ సమాధానం చెప్పారు. కేవలం తాను తెల్ల కాగితాలపై సంతకాలు చేశానని, సినిమాల విషయంలో ఒప్పందం జరగడం అనేది తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×