EPAPER

OnePlus Nord 4 Smartphone Launch: వన్‌ప్లస్‌ నుంచి నెంబర్ వన్ ఫోన్ లాంచ్.. కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. అట్లుంటది మరి..!

OnePlus Nord 4 Smartphone Launch: వన్‌ప్లస్‌ నుంచి నెంబర్ వన్ ఫోన్ లాంచ్.. కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. అట్లుంటది మరి..!

OnePlus Nord 4 Smartphone Launched in India: టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన హవా చూపించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తుంది. తాజాగా OnePlus నుంచి మరో కొత్త ఫోన్ దేశీయ మార్కెట్‌లో లాంచ్ అయింది. OnePlus Nord 4 పేరుతో కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త నార్డ్ ఫోన్ దీని కంటే ముందు మోడల్ OnePlus Nord 3 ధర కంటే తక్కువకే రిలీజ్ అయింది. ఈ కొత్త ఫోన్ దాదాపు రూ. 30,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. OnePlus ఫోన్ శక్తివంతమైన మిడ్ రేంజ్ Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 4 సంవత్సరాల పాటు Android OS అప్‌డేట్‌లను కూడా పొందుతుంది. OnePlus Nord 4 ధర, ఫీచర్ల విషయానికొస్తే..


OnePlus Nord 4 Specifications

OnePlus Nord 4 అద్భుతమైన 6.74-అంగుళాల U8+ OLED డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,150 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. OnePlus Nord 4కి 4 సంవత్సరాల పాటు Android అప్‌డేట్స్, 6 సంవత్సరాల పాటు సెక్యురిటీ ప్యాచ్‌లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. అలాగే ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. OnePlus Nord 4 శక్తివంతమైన 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.


ఇందులో అందించిన ఛార్జర్ కేవలం 28 నిమిషాల్లో 1 నుంచి 100 శాతం వరకు ఫోన్‌ను ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన సోనీ లైట్600 సెన్సార్ ఉంది. అలాగే 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. స్క్రీన్ లోపల ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇందులో కొన్ని ప్రత్యేక AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: దూకుడు పెంచిన మోటో.. మళ్లీ భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు!

OnePlus Nord 4 Price

OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 29,999గా ఉంది. అదే సమయంలో మిడ్ రేంజ్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999గా ఉంది. అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ రూ. 35,999గా నిర్ణయించింది. దీన్ని అమెజాన్ నుండి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఆగస్టు 2 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా బ్యాంక్ కార్డ్‌లపై రూ.3,000 వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది.

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×