Suchir Balaji : ఓ 26 ఏళ్ల అమెరికన్ కుర్రాడు.. 4 సంవత్సరాలు OpenAIలో పనిచేశాడు. ఏడాదిన్నరపాటూ ChatGPTలో సైతం పనిచేశాడు. ఇన్నాళ్లు ఈ విషయంపై పనిచేసి చివరికి ఆ తీరునే తప్పుపట్టాడు. ఓపెన్‌ఏఐ US కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించాడు. సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపించాడు. చివరకు అనూహ్య రీతిలో తన అపార్ట్మెంట్ లో శవమై మిగిలాడు. పోలీసులు అతని మరణాన్ని ఆత్మహత్యగా ధృవీకరించారు. అసలు ఏం జరిగింది? ఓపెన్ ఏఐ చేసిన తప్పులను ఈ కుర్రాడు ఎలా ఎత్తిచూపాడు? అతని చివరి పోస్ట్ లో ఏముంది? ఇలాంటి విషయాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయం తెలిపిన సమాచారం ప్రకారం.. మాజీ OpenAI సైంటిస్ట్, విజిల్‌బ్లోయర్ సుచి బాలాజీ నవంబర్ 26, 2024న శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయినట్లు తెలుస్తుంది. అధికారులు అతను ఆత్మహత్య చేసుకున్నాడని ధృవీకరించారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. గతంలో ChatGPT అభివృద్ధిలో US కాపీరైట్ చట్టాలను OpenAI ఉల్లంఘించిందని ఈ 26 ఏళ్ల కుర్రాడు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈా నేపథ్యంలో OpenAI ఇప్పటికే వ్యాజ్యాలతో వ్యవహరిస్తుండగా.. కంపెనీకి వ్యతిరేకంగా వేసిన దావాలలో బాలాజీ ప్రధాన పాత్రధారుడిగా ఉన్నారు.
బాలాజీ ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ నుండి నిష్క్రమించే ముందు OpenAIలో పరిశోధకుడిగా పనిచేశాడు. కంపెనీని విడిచిపెట్టిన తర్వాత, ఆన్‌లైన్ డేటాను అనుకరించడం, ఇంటర్నెట్‌లో దేనినైనా భర్తీ చేయడం, ఇప్పటికే ఉన్న సేవలను సైతం భర్తీ చేయడం ద్వారా ChatGPT తయారీదారులు కాపీరైట్ చట్టాన్ని ఎలా ఉల్లంఘించారనే విషయంపై తన గళాన్ని వినిపించాడు. 2022లో ChatGPT అరంగేట్రం చేసినప్పటి నుండి OpenAI తమ చాట్‌బాట్‌కు శిక్షణ ఇవ్వడంలో కాపీరైట్ ను ఉల్లఘించిందని తెలిపాడు.
తన చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో సైతం ఇదే విషయాన్ని లేవనెత్తాడు. “నాకు మొదట్లో కాపీరైట్, న్యాయ విధానాల కోసం పెద్దగా తెలియదు. కానీ GenAI కంపెనీలపై దాఖలైన అన్ని వ్యాజ్యాలను చూసిన తర్వాత ఆసక్తి పెరిగింది. నేను సమస్యను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇందులో లోపాలు అర్ధమయ్యాయి. AI ఉత్పత్తులకు రక్షణ చాలా అసంపూర్ణంగా ఉందని… ఇదే విషయంలో రక్షణ కరువైందని నిర్ణయానికి వచ్చాను. ప్రాథమిక కారణంతో అవి వాటి డేటాతో పోటీపడే ప్రత్యామ్నాయాలను సృష్టించగలవు” అంటూ తన పోస్ట్ లో తెలిపారు.
అసలు ఎవరీ సుచిర్ బాలాజీ? –
బాలాజీ బెర్క్లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. స్కేల్ AI వద్ద OpenAI లో ఇంటర్న్‌షిప్ చేశాడు. అతను 2020లో OpenAI కోసం పని చేస్తున్న అనేక మంది బెర్క్లీ గ్రాడ్యుయేట్‌లతో కలిసి వర్క్ చేశాడు. 2022లో GPT-4 అనే కొత్త ప్రాజెక్ట్ కోసం డేటాను సేకరిస్తూ.. ఇంటర్నెట్‌లోని అన్ని ఆంగ్ల భాషా టెక్స్ట్‌లను విశ్లేషిస్తూ పరిశోధనలు చేశాడు. GPT-3 అనేది చాట్‌బాట్ కాదు, ఇతర సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను రూపొందించడానికి కంపెనీలు, కంప్యూటర్ ప్రోగ్రామర్‌లను ఉపయోగించుకునే మార్గం అని పరిశోధనల్లో తెలిపాడు.
ALSO READ : లాంఛ్ కు ముందే మోటో ఫోల్డబుల్ మెుబైల్ ఫీచర్స్ లీక్.. ధర, కెమెరా క్వాలిటీ వేరే లెవెల్ అంతే!