Mohammed Shami: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్ బౌలర్ మహమ్మద్ షమీ {Mohammed Shami} మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మహమ్మద్ షమీ ఫిట్నెస్ పై రోహిత్ శర్మ పలుమార్లు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. షమీ {Mohammed Shami} ఈ సంవత్సరం ప్రారంభంలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత రంజి ట్రోఫీతో ఒక నెల క్రితం దేశీయ క్రికెట్ లో తిరిగి వచ్చాడు. దేశి వాలి టి-20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించి తన ఫిట్నెస్ చాటుకున్నాడు షమీ.
Also Read: IND vs AUS: ఫీల్డింగ్ చేస్తుండగా మహమ్మద్ సిరాజ్ కి ఘోర అవమానం
ఈ ట్రోఫీలో అటు బంతితోనే కాకుండా బ్యాట్ తోను అదరగొట్టాడు. చండీగఢ్ తో జరిగిన కీలక ప్రీ క్వార్టర్స్ ఫైనల్ లో ఆల్ రౌండ్ మెరుపులతో బెంగాల్ జట్టు విజయంలో ముఖ్యపత్ర పోషించాడు షమీ {Mohammed Shami}. కోలుకున్న అనంతరం దేశి వాలిలో 64 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన షమీ.. 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర ట్రోఫీ రెండు చివరి టెస్టుల కోసం షమీ ఆస్ట్రేలియా వెళ్లనున్నాడనే వార్తలు వెలువడ్డాయి. నవంబర్ 14న బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడడం ద్వారా తాను పూర్తిగా కోలుకున్నానని షమీ చెప్పుకొచ్చాడు.
కానీ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం షమీ {Mohammed Shami} కి కోపం తెప్పించినట్టుగా తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో షమీ పాల్గొంటాడా..? అని రోహిత్ శర్మని ప్రశ్నించగా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ మోకాలికి గాయం అయ్యిందని.. మేనేజ్మెంట్ అతడిని తీసుకోవడానికి తొందర పడడం లేదంటూ చెప్పుకొచ్చాడు. షమీ విరామం తీసుకొని చాలా కాలం గడిచిన కారణంగా తాము అతడి విషయంలో తొందర పడడం లేదని చెప్పుకొచ్చాడు రోహిత్. ఇదే విషయంలో రోహిత్ శర్మ – షమీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ఫిట్నెస్ పై ఎందుకు తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నావని రోహిత్ శర్మని షమీ నిలదీశాడట.
Also Read: IND vs Aus 3rd Test: 76 ఓవర్లు వృధా…తొలి రోజు ఆట రద్దు..!
ఇలా మొహమ్మద్ షమీని రోహిత్ శర్మ టార్చర్ పెడుతున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాదు రోహిత్ టార్చర్ తట్టుకోలేక షమీ {Mohammed Shami} టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్ 2025 కోసం సెమీ తనను తాను ఫీట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. 2025 ఐపీఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ తో 10 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు షమీ. ఇందుకోసం ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడట. మరి షమీ నిజంగానే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడా..? లేక రాబోయే ఐసీసీ టోర్నమెంట్ లో పాల్గొంటాడా..? అన్నది వేచి చూడాలి.