Indian Railway’s Integrated Track Monitoring System (ITMS): భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నది. రైల్వే ప్రమాదాలకు తావులేకుండా భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇప్పటికే ‘కవచ్’ లాంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్న రైల్వేశాఖ.. ట్రాక్ మెయింటెనెన్స్, భద్రతను మెరుగుపరచడానికి చర్యలు చేపడుతున్నది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఇంటిగ్రేటెడ్ ట్రాక్ మానిటరింగ్ సిస్టమ్ (ITMS)ను పరిశీలించారు. దీని ద్వారా దేశంలోని రైల్వే నెట్ వర్క్ ను మానిటర్ చేస్తున్నారు. ఈ వ్యవస్థను మరింత అప్ డేట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాక్ నిర్వహణ, భద్రతను పెంపొందించేలా అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ట్రాక్ లోపాలపై స్పష్టమైన హెచ్చరికలు
ITMS అనేది గంటకు 20 కిలో మీటర్ల నుంచి 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ట్రాక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి రూపొందించబడిన అధునాతన వ్యవస్థ. ఈ వెహికల్ లేజర్ సెన్సార్లు, హై స్పీడ్ కెమెరాలు, యాక్సిలరోమీటర్లు, GPSతో అమర్చబడి ఉంటుంది. ఇది రియల్ టైమ్ కాంటాక్ట్ లెస్ డేటా సేకరణ చేస్తుంది. రైల్వేస్ ట్రాక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (TMS)తో అనుసంధానించబడిన ITMS, ఎక్కడైనా ట్రాక్ లో లోపాలు ఉంటే వెంటనే SMS, ఇమెయిల్ ద్వారా వెంటనే హెచ్చరికలను జారీ చేస్తుంది.
దేశ వ్యాప్తంగా 17 జోన్లలో ITMS వాహనాల సేవలు
ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు ప్రకారం.. భారతీయ రైల్వే సంస్థ మొత్తం 17 రైల్వే జోన్లలో ITMS వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. వీటి కోసం సుమారు రూ.180 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం, దేశ వ్యాప్తంగా ఏడు ITMS వాహనాలు పనిచేస్తున్నాయి. కొత్తగా మరో 10 వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే సంస్థ భావిస్తున్నది. ఈ వాహనలకు సంబంధించి ఒక్కో దానికి సుమారు రూ. 18 కోట్లు అవుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ఇండియన్ రైల్వేలో హిస్టారికల్ మైల్ స్టోన్.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లింక్ చివరి ట్రాక్ కంప్లీట్!
అధునాతన సెన్సార్లతో ట్రాక్స్ భద్రత పర్యవేక్షణ
ITMS వాహనాలు రైల్వే ట్రాక్స్ కు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. రైల్వే ట్రాక్ కు సంబంధించిన డేటా సేకరణ కోసం అధునాతన సెన్సార్లు, కెమెరాలను కలిగి ఉంటాయి ITMS వాహనాలు. ట్రాక్ కు సంబంధించి ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తాయి. దాని ఎడ్జ్ సర్వర్లు రియల్ టైమ్ డేటాను ప్రాసెస్ చేయడంలో ఆన్ బోర్డ్ సిస్టమ్ లకు సాయం చేస్తాయి. మనీష్ పాండే నేతృత్వంలోని ADJ ఇంజనీరింగ్ సహకారంతో కంపెనీ రైల్ ఇన్‌స్పెక్షన్ సిస్టమ్, అల్ట్రాసోనిక్ రైల్ టెస్టింగ్ సిస్టమ్ వంటి అనేక అధునాతన వ్యవస్థలను డెవలప్ చేసింది. దీని ద్వారా రైల్వే ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రయాణీకులను సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చేందుకు అవసరం అయిన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Read Also: స్టేషన్‌లో ఆగకుండా వెళ్లి, రివర్స్ లో వెనకొచ్చిన రైలు, సీన్ కట్ చేస్తే..