BigTV English

Oppo A3 5G Launched: ఒప్పో నుంచి కొత్త ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5100mAh బ్యాటరీతో లాంచ్!

Oppo A3 5G Launched: ఒప్పో నుంచి కొత్త ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5100mAh బ్యాటరీతో లాంచ్!

Oppo A3 5G Launched: టెక్ బ్రాండ్ Oppo భారతీయ మార్కెట్లో Oppo A3 5G స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా క్లాసిక్‌ లుక్‌లో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. దీని కెమెరా, ప్రాసెసర్, డిస్‌ప్లే కూడా అద్భుతంగా ఉన్నాయి. Oppo A3 5G ఫోన్ 6.67 అంగుళాల HD + LCD డిస్ప్లేను కలిగి ఉంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. Oppo A3 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.


Oppo A3 5G Price

Oppo A3 5G Price ధర విషయానికొస్తే.. Oppo A3 5G 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఓషన్ బ్లూ, నెబ్యులా రెడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Also Read: మైండ్ బ్లోయింగ్ గురూ.. ఒప్పో కొత్త ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు లీక్.. AI ఫీచర్లు హైలైట్..!

Oppo A3 5G Specifications

Oppo A3 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో Mali-G57 MC2 GPUని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 6GB LPDDR4X RAM అందించారు. దీనిని వర్చువల్ RAM ద్వారా విస్తరించవచ్చు. ఇది 128GB eMMC 5.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్‌ఓఎస్ 14.0.1పై పనిచేస్తుంది.

సేఫ్టీ కోసం ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ అన్‌లాక్‌ను కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. A3 5G ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించబడింది. అదే సమయంలో దీని ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది. A3 5G ఫోన్ 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,100mAh బ్యాటరీతో వచ్చింది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 5, బ్లూటూత్ 5.3, USB టైప్ C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, లిక్విడ్ రెసిస్టెన్స్‌తో మన్నికను అందిస్తుంది.

Related News

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

Big Stories

×