BigTV English

Egg Pickle: స్పైసీ అండ్ యమ్మీ ఎగ్ పికిల్.. ఒక్కసారి తింటే వదలరు

Egg Pickle: స్పైసీ అండ్ యమ్మీ ఎగ్ పికిల్.. ఒక్కసారి తింటే వదలరు

Egg Pickle Recipe: కోడిగుడ్డుతో రకరకాల వంటలు చేస్తుంటారు. ఎగ్ బుర్జి, గుడ్డు పులుసు, ఎగ్ బిర్యానీ, ఎగ్ దోస, ఆమ్లెట్, ఎగ్ న్యూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ మ్యాగీ.. ఇంకా చాలానే ట్రై చేస్తుంటారు. ఇక పచ్చళ్లలో నిల్వ పచ్చళ్లు చాలానే ఉన్నాయి. ఆవకాయతో మొదలుపెడితే.. నాన్ వెజ్ పచ్చళ్ల వరకూ ఒక్కో పచ్చడికి ఒక్కో రుచి. దేనికదే స్పెషల్.


మరి ఎగ్ తో కూడా పచ్చడి చేసుకోవచ్చు. అదెలాగో, అందుకు ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం.

ఎగ్ పచ్చడికి కావలసిన పదార్థాలు


ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు

కోడిగుడ్లు – 3

ఉప్పు – రుచికి సరిపడా

కారం – మీరు తినగలిగినంత

మెంతులు – చిటికెడు

ధనియాలు – 1 స్పూన్

ఆవాలు – కొద్దిగా

దాల్చిన చెక్క – చిన్నది 1

లవంగాలు – 4

యాలకులు – 2-3

మిరియాలు – కొద్దిగా

జీలకర్ర – కొద్దిగా

ఎగ్ పచ్చడి తయారీ విధానం

కోడిగుడ్లను పగులగొట్టి.. పచ్చసొనతో సహా ఒక్కగిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం వేసి బాగా బీట్ చేసి.. కుక్కర్ లో పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. పైన చెప్పిన మసాలా దినుసులను సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి.. పొడి చేసుకుని పెట్టుకోవాలి.

ఇప్పుడు కుక్కర్ విజిల్ ఆరిన తర్వాత.. ఉడికించిన కోడిగుడ్ల సొనను తీసి.. ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత.. కొద్దిగా ఉప్పు, కారం, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతే.. ఎగ్ పికిల్ రెడీ. ప్రిపేర్ చేసిన 2 గంటల తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే.. బ్రహ్మాండంగా ఉంటుంది. ఓ సారి ట్రై చేయండి మరి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×