BigTV English

Tollywood: కమిటీ కుర్రాళ్ల టీమ్‌పై టాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు

Tollywood: కమిటీ కుర్రాళ్ల టీమ్‌పై టాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు

Tollywood Star Directors Praise The Team Of Committee Boys: చిన్న మూవీగా రిలీజై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సొంతం చేసుకున్న లేటెస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్లు. ఈ మూవీపై టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ ప్రశంసిస్తోంది. అయితే తాజాగా ఇదే మూవీ విషయమై దిగ్గజ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్,క్రిష్ లతో సహా.. స్టార్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్, నాని, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్‌ పొగడ్తలతో ముంచెత్తారు. కొత్త వాళ్లతో తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదువంశీలను అభినందిస్తూ సోషల్‌మీడియా వేదికగా ప్రశంసించారు. నేటితరం కుర్రాళ్లు సాధించిన పెద్ద విజయమంటూ రాజమౌళి కితాబు ఇచ్చారు. కమిటీ కుర్రోళ్లు విజయం సాధించారనే మాట వినడం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని డైరెక్టర్ సుకుమార్ ఆకాశానికి ఎత్తేశాడు.


టాలెంట్‌ ఉన్న యూత్‌ని పెట్టి కమిటీ కుర్రోళ్లతో తామేంటో నిరూపించుకున్నారని నాగ్ అశ్విన్ పొగిడారు. రిలీజైన నాలుగు రోజుల్లోనే ఇటు చిత్ర ప్రముఖుల నుంచి అటు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు రావడం పట్ల మూవీ యూనిట్ ఎంతో ఆనందంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే.. నిహారిక అన్నయ్య మెగా వారసుడు రామ్‌చరణ్ ఈ మూవీ టీమ్‌కి స్పెషల్‌గా విషెస్ తెలిపాడు. ఈ విజయంలో నా సోదరి నిహారిక అండ్ టీమ్‌కి కంగ్రాట్యూలేషన్ అంటూ రాసుకొచ్చాడు. నిహారిక ఇంతటి సక్సెస్‌ని సాధించినందుకు చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు నీ టీమ్‌తో కలిసి నువ్వు పడిన కష్టం నీ హార్డ్​ వర్క్ అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకమంటూ రాసుకొచ్చాడు.

Also Read: యాప్‌లో పరిచయమైన అమ్మాయిపై రానా సంచలన వ్యాఖ్యలు


కమిటీ కుర్రోళ్లలో భాగమైన అందరికీ నా అభినందనలు అంటూ తెలిపాడు. మెయిన్‌గా చెప్పాలంటే ఈ మూవీ స్టోరికి జీవం పోశిందంటే డైరెక్టర్ యదువంశీకి స్పెషల్ కంగ్రాట్స్ అని రామ్‌చరణ్ అన్నారు. ఇక ఈ మూవీ టీమ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతేకాదు ఈ టీమ్‌కి అందరి నుండి పాజిటివ్ రిప్లైతో పాటుగా పొగడ్తలు వచ్చిపడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు చిన్న సినిమాగా వచ్చిన ఈ టీమ్‌కి ఇన్ని ప్రశంసలు రావడంపై టీమ్ అంతా ఎంతో ఆనందంగా ఉన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×