Big Stories

Oppo A60 launched : ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

Oppo A60 launched : స్మార్ట్‌ఫోన్ కంపెనీ Oppo కస్టమర్ల కోసం కొత్త ఫోన్ లాంచ్ చేసింది. తన బ్రాండ్ నుంచి ఒప్పో A60ని తీసుకొచ్చింది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పొందుతారు.  50MP కెమెరా కూడా ఉంది. అలానే 8 GB RAM + 256 GB స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌ను బడ్జెట్ సెగ్మెంట్‌లో తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ధర ఎంత? ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? తదితర విషయాలు తెలుసుకోండి.

- Advertisement -

టెక్ కంపెనీ ఒప్పో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వియత్నాంలో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ ఒప్పో A60ని లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఇప్పుడు Oppo వియత్నాం వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ కొత్త A-సిరీస్ లైనప్ ఫోన్‌లను కంపెనీ ఇంతకు ముందు విడుల చేసింది. అయితే ఫోన్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే కంపెనీ వెల్లడించలేదు.

- Advertisement -

Also Read : ఐఫోన్ కొనాలని చూస్తున్నారా తమ్ముళ్లూ.. అయితే మే 2 న రెడీగా ఉండండి!

Oppo A60 ధర విషయానికి వస్తే ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 8GB RAM + 128GB, 8GB RAM + 256GB స్టోరేజ్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,450 కాగా 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,353గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను బ్లూ,  పర్పుల్ బ్లూ అనే రెండు అప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఇక Oppo A60 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు గురించి చెప్పాలంటే ఇందులో 6.67 అంగుళాల IPS LCD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్ 1604 x 720 పిక్సెల్‌లు కలిగి ఉంటుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 950 nits పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది.

ఫోన్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో 6nm స్నాప్‌డ్రాగన్ 680 4G చిప్‌సెట్. 8 GB LPDDR4x RAM ఉంది. ఇందులో 128 GB, 256 GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. వీటిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1 TB వరకు పెంచుకోవచ్చు. పవర్ కోసం ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read : రియల్ మీ P1 Pro 5G మొదటి సేల్ ఈ రోజే.. ఆఫర్లు చూస్తే వదలడం కష్టమే..!

ఫోటోగ్రాఫీ కోసం ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. అలానే 2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News