BigTV English

Instagram Friendship : సోషల్ మీడియాలో మహిళతో స్నేహం.. వయసు దాచిందని?

Instagram Friendship : సోషల్ మీడియాలో మహిళతో స్నేహం.. వయసు దాచిందని?

Man Beats his Instagram Friend : ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అవసరానికి మించి సోషల్ మీడియా వాడకం ఒక్కోసారి చిక్కుల్లో పడేస్తుంది. ముక్కు, మొహం తెలియని వారితో స్నేహమే కొంపముంచుతుంది. తాజాగా.. ఇన్ స్టాగ్రామ్ లో ఒక మహిళతో స్నేహం చేసిన 20 ఏళ్ల యువకుడు.. ఆమె తన వయసును దాచుతూ.. యవ్వనంగా ఉన్న ఫొటోను పెట్టినందుకు ఆమెను కొట్టాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ అరెస్ట్ చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ కు చెందిన దీపేంద్ర సింగ్ (20) అనే వ్యక్తికి ఇన్ స్టాగ్రామ్ లో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. తర్వాత ప్రేమలో పడ్డారు. ఆమె ప్రొఫైల్ ఫొటో చూసి చాలా అందంగా ఉందని మురిసిపోయాడు. ఒకరోజు ఫేస్ టు ఫేస్ కలవాలని కోరాడు. ఇద్దరూ ఒక ప్లేస్ లో మీట్ అయ్యారు. ఇక్కడే మనోడు షాకయ్యాడు. ఆమె ప్రొఫైల్ ఫొటో కంటే.. చాలా పెద్దదిగా కనిపించింది. నీ వయసెంత అని అడగగా.. 45 సంవత్సరాలు అని చెప్పింది.

Also Read : సోషల్ మీడియాతో ఆరోగ్య సమస్యలు.. వీటికి పరిష్కారం ఇదే..


దాంతో ఆగ్రహానికి గురైన దీపేంద్ర.. మహిళతో వాదించి ఆమె తలను నేలకేసి కొట్టాడు. ఆపై ఆమె మొబైల్ తీసుకుని పరారయ్యాడు. వెంటనే మహిళ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పింది. దీపేంద్ర ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. విచారణ చేస్తున్నారు.

 

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×