Big Stories

Bomb threat: ఢిల్లీలో తీవ్ర కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్

Bomb threat: దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ, నోయిడాలోని 50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఏకకాలంలో మెయిల్స్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమయిన స్కూల్ యాజమాన్యాలు ముందుగా పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం స్కూళ్లలోని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, బాంబు నిర్వీర్య దళం అక్కడికి చేరుకుని పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

ఢిల్లీలోని చాణక్యపురి, ద్వారక, వసంత్ కుంజ్, సాకేత్, మయూర్ విహార్ స్కూళ్లకు తొలుత ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయని, ఆ తరువాత నోయిడాలోని దాదాపు 50 స్కూళ్లకు పైగా ఈమెయిల్స్ వచ్చినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం పలు స్కూళ్లలో పరీక్షలు జరుగుతున్నాయి. బెదిరింపు మెయిల్స్ రావడంతో పరీక్షలను మధ్యలోనే ఆపేసి, విద్యార్థులను ఇంటికి పంపించారు. స్కూళ్లలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ కనిపించలేదని తెలుస్తోంది. ఈ మెయిల్స్ న్నీ కూడా విదేశాల నుంచి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రజలెవరూ కంగారుపడొద్దని, స్కూళ్లను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: కూటమి అభ్యర్థులకు రెబల్స్ టెన్షన్..

అయితే, ఫిబ్రవరి నెలలో కూడా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూళ్లకు వెళ్లి తనిఖీలు జరపగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News